ఇటీవల బయోపిక్ చిత్రాలకు ఆదరణ పెరుగుతుండటంతో అన్ని భాషల ఇండస్ట్రీలో ఈ బయోపిక్ చిత్రాల జోరు మామూలుగా లేదు.ఇక ఈ క్రమంలో తమిళంలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ బయోపిక్ చిత్రం ‘తలైవి’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.
ఈ సినిమా తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమా కోసం తమిళ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు.
అయితే ఈ సినిమాను సెప్టెంబర్ 10న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమాను పలు భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.అయితే ఈ సినిమాకు సంబంధించి డిజిటల్ ప్రీమియర్‌కు డేట్ ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.
థియేటర్లలో తలైవి చిత్రం రిలీజ్ అయిన నాలుగు వారాల తరువాత ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ స్ట్రీమ్ చేయనుండగా, హిందీ భాషలో ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ ప్రసారం చేయనుంది.
దీంతో ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి రిజల్ట్‌ను రాబడుతుందా అని తమిళ ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.ఈ సినిమాలో తమిళ నటుడు అరవింద్ స్వామి కూడా నటిస్తుండగా, ఈ సినిమాను దర్శకుడు ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నాడు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో జయలలిత జీవితాన్ని ఏ విధంగా చూపిస్తారో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.