దేశంలో జరుగుతున్న రోడ్దు ప్రమాదాలకు లెక్కే లేదు.నిత్యం ఎక్కడో ఒకచోట పొరపాటున లేక గ్రహపాటున తెలియదు గానీ ప్రమాదవశాత్తున జరిగే మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.
ఇక ఇంట్లో నుండి బయటకు వెళ్లితే క్షేమంగా ఇల్లు చేరుకుంటామనే నమ్మకం ఉండటం లేదు.ఎంత జాగ్రత్తగా వెళ్లుతున్న ఏదో ఒక రూపంలో మృత్యువు పోంచి ఉంటుంది.
ఇకపోతే తాజాగా నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఆ వివరాలు చూస్తే.
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల గ్రామం ప్రాంతంలో నెల్లూరు నుంచి ఉదయగిరి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్నాయట.కాగా ఈ ఘటనలో బస్సు కిందికి ఆటో దూసుకు పోయిందని సమాచారం.
ఆ బస్సు కింద ఉన్న ఆటోని క్రేన్ సాయంతో పోలీసులు బయటికి తీస్తున్నారట.అయితే ఇప్పటి వరకు ఒక మృతదేహాన్ని మాత్రమే వెలికితీశారట.
సహాయక చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు మిగతా వివరాలు కాసేపట్లో వెల్లడిస్తారని సమాచారం.కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి కారణాలు తెలియరాలేదు.