కన్నీరు పెట్టిస్తున్న అమ్మతనం.. చనిపోయిన గున్నఏనుగును వదలని తల్లి ఏనుగు

అమ్మతనం, భావోద్వేగాలు మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంటాయని పలు సందర్భాల్లో మనం చూసే ఉంటాం.సోషల్ మీడియా విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత వివిధ వీడియోలు మనకు ఫోన్లలో కనిపిస్తున్నాయి.

 Tearful Sale The Mother Elephant Who Will Not Leave The Dead Gunna Elephant , E-TeluguStop.com

వాటిలో కొన్ని కవ్విస్తుంటాయి.మరికొన్ని నవ్విస్తుంటాయి.

ఇంకొన్ని కన్నీరు పెట్టిస్తుంటాయి.తాజాగా ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో చూసిన వారందరినీ కన్నీరు పెట్టిస్తోంది.

పశ్చిమ బెంగాల్‌‌కు సంబంధించి ఓ ఏనుగుల గుంపునకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.బనార్హాట్ బ్లాక్‌లోని డోర్స్ ప్రాంతంలోని చునాభతి టీ తోటలో ఆ వీడియోను తీశారు.

ఆ ప్రాంతంలో ఓ 30 నుంచి 35 వరకు ఉండే ఏనుగుల గుంపు సంచరిస్తోంది.ఆ గుంపులో ఓ ఏనుగు పిల్ల ఏ కారణం వల్లనో మృతి చెందింది.

అయితే చనిపోయిన ఆ గున్న ఏనుగును దాని తల్లి వదిలి పెట్టలేదు.దానిని మోసుకుంటూ ఒక తేయాకు తోట నుంచి మరొక తోటకు కన్నీళ్లతో పరుగులు పెట్టింది.

దాదాపు ఏడు కిలో మీటర్లకు పైగా ప్రయాణించింది.ఈ సన్నివేశాన్ని చూసిన వారందరికీ ఈ ఘటన కన్నీళ్లు పెట్టించింది.

ఇలా చాలా తేయాకు తోటలను దాటుకుని చివరికి రెడ్‌బ్యాంక్ టీ గార్డెన్‌లోని పొద దగ్గర పిల్ల ఏనుగు మృతదేహాన్ని విడిచిపెట్టింది.ఎంతో కన్నీళ్లతో మిగిలిన ఏనుగులతో కలిసి బాధగా వెళ్లిపోయింది.

ఈ సన్నివేశాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.దీనిని చూసిన నెటిజన్లు ఆ ఏనుగు తల్లి ప్రేమను కొనియాడుతున్నారు.

జంతువైనా దానికి కూడా తల్లిమనసు ఉంటుంది కదా అని కామెంట్లు పెడుతున్నారు.ఇక ఏనుగుకు కూడా మనిషిలా భావోద్వేగాలు ఉంటాయని పలు సందర్భాల్లో శాస్త్రవేత్తలు చెబుతుంటారు.

దానిని తాజా ఘటన నిరూపించింది.అటవీ సిబ్బందికి ఈ విషయం తెలియడంతో అక్కడకు చేరుకున్నారు.

ఏనుగు పిల్ల ఏ కారణంతో చనిపోయిందో అన్వేషిస్తున్నారు.మరోవైపు పెద్ద మొత్తంలో ఏనుగుల గుంపు అక్కడ సంచరిస్తుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube