టీడీపీ రెండో విడత ప్రజాగళం యాత్ర.. షెడ్యూల్ ఖరారు..!!

ఏపీలో ఎన్నికలు( AP Elections ) దగ్గర పడుతున్నాయి.మే 13వ తారీకు పోలింగ్ జరగనుంది.

ఎలక్షన్స్ కి ఇంకా 40 రోజులు మాత్రమే సమయం ఉంది.దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu Naidu ) భారీ ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

ప్రజాగళం పేరిట మొదటి విడతలో ఇప్పటికే రాయలసీమలో కొన్ని ప్రాంతాలలో పర్యటించడం జరిగింది.ఈ పర్యటనలో భాగంగా వైసీపీ ప్రభుత్వం( YCP Govt ) పై సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు.

అదే సమయంలో "తెలుగుదేశం జనసేన బీజేపీ" కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు చేసే మంచి పనులను గురించి వివరిస్తున్నారు.కాగా ఇప్పుడు ప్రజాగళం యాత్ర మరోసారి చేపట్టేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు.

Advertisement

ఏప్రిల్ 3న కొత్తపేట, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో( Ramachandrapuram Constituency ) టీడీపీ అధినేత ప్రచారం చేయనున్నారు.ఏప్రిల్ 4న కొవ్వూరు, గోపాలపురంలో రోడ్ షో నిర్వహించనున్నారు.ఏప్రిల్ 5న నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో ప్రజాగళం యాత్ర చేపడతారు.

ఏప్రిల్ 6న పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు.ఏప్రిల్ 7న పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు.

అనంతరం మూడు పార్టీలు( TDP Janasena BJP ) కలిసి ఉమ్మడిగా భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నట్లు సమాచారం.ఆల్రెడీ బీజేపీతో పొత్తు ఖరారు తర్వాత చిలకలూరిపేటలో మూడు పార్టీలు కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది.

ఈ సభకు ప్రధాని మోదీ( PM Modi ) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.కాగా రాబోయే రోజుల్లో ఏపీలో ఎన్నికల ప్రచారంలో కూటమి తరఫున కేంద్ర మంత్రులు కూడా ప్రచారంలో పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బీఆర్ఎస్ కు మళ్లీ గుర్తుల టెన్షన్ !
Advertisement

తాజా వార్తలు