ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు పెన్షన్( Pension ) చుట్టూ తిరుగుతున్నాయి.ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల ద్వార పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం ఆపేసింది.
దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది పింఛన్ దారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ పరిణామంతో తెలుగుదేశం పార్టీ( TDP )పై అధికార పార్టీ వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
వాలంటీర్లను పెన్షన్ పంపిణీ చేయకుండా అడ్డుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ అందించవచ్చు కదా అని చంద్రబాబు వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్లు ఇవ్వడం జరిగింది.
కాగా ఇదే విషయంపై సోషల్ మీడియాలో చంద్రబాబు( Chandrababu ) సంచలన పోస్ట్ పెట్టారు.“ఆంధ్రప్రదేశ్ లో 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఇలాంటి వాతావరణంలో వృద్దులను, దివ్యాంగులను… ఇతర పెన్షన్ లబ్దిదారులను( Pensioners ) 3-4 కిలోమీట్లర్ల దూరంలో ఉన్న గ్రామ/వార్డు సచివాలయాల చుట్టూ తిప్పించుకోవడం మానవత్వం అనిపించుకోదు.అందుకే పింఛన్లను ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే ఏర్పాట్లు చేసేలా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సూచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ భారత ప్రధాన ఎన్నికల అధికారికి( Chief Election Commissioner of India ) లేఖ రాశాను” అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
ఇంకా ఇదే విషయంపై ఇతర పార్టీలకు చెందిన నేతలు గతంలో 2019కి ముందు వాలంటీర్లు లేనప్పుడు పెన్షన్ అధికారులు( Pension Officials ) ఇచ్చిన దాన్ని గుర్తు చేశారు.పెన్షన్ పంపిణీ విషయం అడ్డం పెట్టుకుని రాజకీయ పొందటానికి పార్టీలు వ్యవహరిస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు.