సాంకేతిక పరిజ్ఞానం తో ఓ ఘరానా సెల్ ఫోన్ ల దొంగ ను గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.గుంటూరు జిల్లా అమర్తలూరు గ్రామానికి చెందిన ఎన్.
ఫణికుమార్ హాస్టల్లో ఉంటూ కిట్స్ కాలేజీలో చదువుతున్నాడు.ఈ నెల 7 వ తేదీన తన తోటి విద్యార్థులు 23 మంది తో కలిసి, తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి కరకట్ట వెంబడి ఉన్న గోకరాజు గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్న కృష్ణా నది వద్దకు స్నానానికి వచ్చాడు.
మొత్తం 24 మంది సెల్ ఫోన్ లు ఓ బ్యాగ్ లో భద్రపరిచి ఒడ్డున పెట్టి , స్నానానికి వెళ్లి వచ్చే సరికి బ్యాగ్ మాయమైంది.ఫణికుమార్ తన స్నేహితులతో కలిసి తాడేపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి , సెల్ ఫోన్ లు దొంగతనం చేసిన ముద్దాయి కనకం దామోదర రావు ను గురువారం సీతానగరం పుష్కర్ ఘాట్ల వద్ద అరెస్ట్ చేశారు.అతని వద్ద నుండి 22 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.
మరో రెండు ఫోన్ల ను అమ్ముకొని జల్సా చేశాడని పోలీసులు తెలిపారు.
విజయనగరం జిల్లా గుర్ల మండలం కు చెందిన కనకం దామోదర రావు, సెల్ ఫోన్ లు దొంగతనం చేయడం, వాటిని ఓ ఎల్ ఎక్స్ లో అమ్మకానికి పెట్టడం, జల్సాలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు.
గతంలో విజయనగరం, విశాఖపట్నం ల్లోని పలు ఇళ్లు, హాస్టళ్లలో ఇలాగే సెల్ ఫోన్లు దొంగిలించి, ఓ ఎల్ ఎక్స్ లో అమ్ముకొని, వచ్చిన డబ్బులతో ఒక స్పోర్ట్స్ బైకు, ఖరీదు అయిన ఫోన్ ను కొనుక్కొని జల్సా చేసినట్లు పోలీసులు తెలిపారు.ఏప్రిల్ నెలలో ఇలాగే దొంగతనం కేసు లో విశాఖపట్నం పోలీసులు దామోదర రావు ను అరెస్ట్ చేయగా, జైలు కు వెళ్లి వచ్చి మళ్ళీ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
చాకచక్యంగా వ్యవహరించి నిందితుడు ను అరెస్ట్ చేసిన తాడేపల్లి సిఐ లు శేషగిరిరావు, సాంబశివరావు, ఎస్సై లు రమేష్, వినోద్ లను అర్బన్ ఎస్పీ అరిఫ్ హఫీజ్ అభినందించారు.