అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ గురించి రోజుకో వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ చిత్రంలో బన్నీకి తల్లి పాత్రలో టబు కనిపించబోతుంది.
ఈ చిత్రంలో తల్లి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని అంటున్నారు.ఇక ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా ఇప్పటికే పూజా హెగ్డేను ఎంపిక చేయగా మరో హీరోయిన్ పాత్రకు గాను నివేధా పేతురాజ్‌ను ఎంపిక చేశారు.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణలో అక్కినేని హీరో సుశాంత్ పాల్గొంటున్నాడు.
అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ సక్సెస్ మాట ఎరిగి చాలా ఏళ్లు అయ్యింది.
దాంతో అక్కినేని హీరో సుశాంత్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించేందుకు సైతం సిద్దం అయ్యాడు.అందుకే త్రివిక్రమ్ ఇచ్చిన ఆఫర్‌కు వెంటనే ఓకే చెప్పేశాడు.భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో నటించడం వల్ల నటుడిగా అయినా నిరూపించుకోవాలని సుశాంత్ ఆశ పడుతున్నాడు.ఇక ఈ చిత్రం కథ గురించి ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ తమ్ముడి పాత్రలో సుశాంత్ కనిపించబోతున్నాడు.టబు తల్లి కొడుకులు అయిన వీరిద్దరు విభిన్నమైన ఆలోచన కలిగి ఉంటారు.దాంతో కొన్ని సంఘటనల కారణంగా విభేదాలు వస్తాయి.ఆ తర్వాత తండ్రి కోసం ఎలా ఒక్కటి అయ్యారు, తల్లి కోరికను ఎలా తీర్చారు అంటూ సినిమాలో చూపించబోతున్నారట.
మరో వర్షన్‌లో తమ్ముడు సుశాంత్ చనిపోతే బన్నీ ఎలా విలన్స్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు అనే కథ అంటూ కూడా ప్రచారం జరుగుతోంది.మొత్తానికి బన్నీ, సుశాంత్‌లు అన్న దమ్ములుగా కనిపించబోతున్నారనేది మాత్రం ఎక్కువగా వినిపిస్తున్న టాక్.