సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాలతో ఎంత బిజీ జీవితం గడుపుతున్నా కానీ తన కుటుంబంతో మాత్రం ఎప్పుడు టచ్ లో ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.మహేష్ బాబు ఈ సినిమా షూటింగుల నుండి విరామం తీసుకుని అప్పుడప్పుడు ఫ్యామిలీతో కలిసి విహార యాత్రలకు వెళ్లడం కూడా మనం గమనిస్తూనే ఉంటాం.
కరోనా వైరస్ నేపథ్యంలో గత ఎనిమిది నెలలుగా ఎక్కడికీ బయటికి వెళ్లని మహేష్ బాబు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడు.దీంతో వారి కుటుంబ సభ్యులతో మరింత అన్యోన్యతను పెంచుకున్నాడు.
అంతేకాదు కూతురు, కొడుకు, భార్యతో కలిసి ఎన్నో మధుర క్షణాలు పొందగలిగాడు.ఇకపోతే ప్రస్తుతం కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పట్టడంతో మహేష్ బాబు తాజాగా అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
అమెరికాకు వెళ్లే సమయంలో మహేష్ బాబు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ కొత్త సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నాం.లైఫ్ ఈజ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అంటూ మాస్కులు ధరించి ఉన్న సెల్ఫీ లను తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశాడు.
హైదరాబాద్ నుంచి అమెరికా కి చేరుకున్న మహేష్ బాబు కుటుంబం తాజాగా ఓ హోటల్లో తన కూతురు సితారతో కలిసి మహేష్ బాబు దిగిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.హోటల్ గది నుండి బీచ్ ను చూస్తున్నప్పుడు ఆ ఫోటో క్లిక్ మనిపించారు.
ఇందుకు సంబంధించిన ఫోటోను మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది.ఇందుకు సంబంధించి కొందరు నెటిజెన్స్ వారి స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు.
వీరిద్దరిని చూసి కింగ్ అండ్ లిటిల్ ప్రిన్సెస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే ఈ సంవత్సరం మొదట్లో సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ విజయం సాధించిన మహేష్ బాబు ఆ తర్వాత దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తున్నాడు.
అయితే అమెరికాలోనే రెగ్యులర్ షూటింగ్ సంబంధించి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం కుటుంబంతో అమెరికాలో విహార యాత్ర ముగిసిన తర్వాత మహేష్ తిరిగి షూటింగ్ లో పాల్గొననున్నట్లు టాలీవుడ్ సమాచారం.
షూటింగ్ అలాగే ఫ్యామిలీ ట్రిప్ రెండు కలిసి వచ్చే విధంగా ఈ టూర్ ప్లాన్ చేసుకున్నట్లు కనబడుతోంది.