సుజిత( Sujitha ) తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.పసివాడి ప్రాణం సినిమాలో బాలనటిగా నటించిన ఈమె అనంతరం పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.
ఇక తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి సీరియల్స్ లో నటిస్తూ ఎంతోమంది బుల్లితెర అభిమానులను సొంతం చేసుకున్నారు.ఈ విధంగా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సుజిత తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈమె నటి విడాకుల గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.నటి కళ్యాణి( Kalyani ) స్వయంగా సుజిత అన్నయ్య కిరణ్ ( Kiran ) ను వివాహం చేసుకున్నారు.

ఈ సందర్భంగా సుజిత మాట్లాడటంతో తాను చిన్న వయసులోనే తండ్రి చనిపోవడంతో అన్నయ్య తండ్రి అయ్యి నన్ను పెంచారని తెలిపారు.అందుకే నాకు అన్నయ్య అంటే కాస్త భయం గౌరవం కూడా ఉంది.ఇక అన్నయ్య కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.దర్శకుడుగా ఈయన పలు సినిమాలు చేశారు.ఈ క్రమంలోనే నటి కళ్యాణితో పెళ్లి జరిగింది.కళ్యాణి కూడా తనతో చాలా మంచిగా ఉండేదని తెలిపారు.
ఇద్దరం సొంత అక్క చెల్లెలు మాదిరిగానే ఉండే వాళ్ళమని సుజిత తెలిపారు.అయితే కళ్యాణి కిరణ్ ఇద్దరు విడిపోవడానికి కారణం అప్పులే అంటూ ఈ సందర్భంగా సుజిత తెలిపారు.

ఆర్థిక సమస్యలు( Financial Problem ) ఎవరికి ఎక్కువ రోజులు ఉండకూడదు అలా ఉన్న ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ సమస్యను బ్యాలెన్స్ చేసే స్థాయిలో ఉండాలని తెలిపారు.అయితే వీరిద్దరూ ఒకానొక సమయంలో తీసుకున్నటువంటి ఓ నిర్ణయమే వారి జీవితం ఇలా కావడానికి కారణమైందని తెలిపారు.ఇండస్ట్రీలో కళ్యాణి నటిగా, కిరణ్ దర్శకుడిగా కొనసాగుతున్న సమయంలోనే నిర్మాతగా మారి ఒక సినిమాని చేశారు.ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అప్పులు పాలయ్యారని.ఈ అప్పులను తీర్చడం కోసం కేరళలో ఉన్నటువంటి ఒక విలువైన ప్రాపర్టీని అమ్మారని, ఇలా పీకల్లోతో అప్పుల పాలు కావడంతోనే వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు అంటూ తన అన్నయ్య కిరణ్ , కళ్యాణి విడాకులు గురించి నటి సుజిత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.