టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు తమ సినిమాలకు ఎక్కువగా థమన్, దేవిశ్రీ ప్రసాద్ లకు మ్యూజిక్ డైరెక్టర్లుగా అవకాశాలు ఇస్తున్న సంగతి తెలిసిందే.కిక్ సినిమాతో తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించిన థమన్ ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.
వేగంగా ట్యూన్లు ఇవ్వడంతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇస్తాడని థమన్ కు మంచి పేరుంది.మిగతా మ్యూజిక్ డైరెక్టర్లతో పోలిస్తే థమన్ తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారని సమాచారం.
అయితే థమన్ సంగీతం అందించిన పాటల్లో కొన్ని పాటలు కాపీ అని గతంలో విమర్శలు వ్యక్తమయ్యాయి.థమన్ సంగీతం అందించిన ప్రతి సినిమాకు ఇలాంటి విమర్శలు వ్యక్తం కాకపోయినా థమన్ కాపీ క్యాట్ అని చాలా సందర్భాల్లో నెటిజన్లు ఆయనను ట్రోల్ చేశారు.
అయితే సినిమా దర్శకనిర్మాతల కోరిక మేరకే కొన్నిసార్లు అలా చేయాల్సి వచ్చిందని గతంలో థమన్ వివరణ ఇచ్చారు.కొన్ని రోజుల క్రితం థమన్ సంగీతం అందించిన వి సినిమా విషయంలో సైతం ఇలాంటి విమర్శలే వినిపించాయి.
ఆ సినిమాలో రాక్షసన్ బీజీఎమ్ ను వాడారని కామెంట్లు వ్యక్తం కాగా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సౌండ్స్ సేమ్ అనిపించాయని.చాలామంది సంగీత పరిజ్ఞానం లేకపోవడం వల్ల కాపీ అని భావిస్తున్నారని చెప్పారు.అయితే రవితేజ హీరోగా తెరకెక్కుతున్న క్రాక్ సినిమాలో బల్లేగా దొరికావే బంగారం పాట తాజాగా విడుదల కాగా నెటిజన్లు ఒరిజినల్ ట్యూన్ అయిన సెల్వా ఎల్ నియాన్ అనే లాటిన్ ట్యూన్ ను షేర్ చేసి థమన్ ను ట్రోల్ చేస్తున్నారు.
ఒరిజినల్ ట్యూన్, క్రాక్ సినిమా ట్యూన్ ఒకేలా ఉండటంతో థమన్ ఈ ఆరోపణల విషయంలో ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
ఒకవేళ దర్శకనిర్మాతల కోరిక మేరకే థమన్ ట్యూన్ ను కాపీ చేయాల్సి వస్తే థమన్ ముందుగానే చెబితే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు