తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సుధీర్ అంటే ఠక్కున వినిపించే మరో పేరు రష్మి.
వీరిద్దరి జోడీకి ఓ రేంజ్ లో అభిమానులు ఉన్నారు అనడంలో సందేహం లేదు.అయితే సుధీర్ ను చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు.
సుధీర్ ను ఆమద్య ఢీ కంటెస్టెంట్ అయిన అక్సా ఖాన్ పెళ్లి చేసుకునేందుకు సిద్దంగా ఉన్నాను అంటూ చెప్పి సంచలనం సృష్టించింది.సుధీర్ అంటే తనకు ఇష్టమని చెప్పింది.
అయితే ఆ విషయమై ఆ సందర్బంలో సుధీర్ పెద్దగా స్పందించలేదు.ఇద్దరి మద్య ఏం లేదేమో అనిపించింది.
ఆ తర్వాత ఎక్కువగా అక్సా ఖాన్ మరియు సుధీర్ లు కలిసిందే లేదు.అందుకే వీరిద్దరికి సంబంధించిన వార్తలు మరింతగా రాలేదు.
మళ్లీ ఇప్పుడు వీరిద్దరు కలిసి వార్తల్లో నిలిచారు.
అక్సాఖాన్ డాన్స్ లోనే కాకుండా అందంలో కూడా ఆహా అనిపిస్తుంది అనడంలో సందేహం లేదు.ఆమె డాన్స్ మరియు అందం కారణంగా ఆమెకు సినిమాల్లో కూడా ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే కొన్ని షోలకు మరియు సినిమాలకు కొరియోగ్రఫీ అందించే అవకాశంను అక్సా ఖాన్ దక్కించుకుంది.
దాంతో ఆమెకు సంబంధించిన వార్తలు మరిన్ని వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సుధీర్ సినిమాలో అక్సా ఖాన్ హీరోయిన్ గా నటిస్తుందట.
వీరిద్దరి కాంబోలో సినిమాకు రంగం సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.అది ఎంత వరకు నిజం అనేది కూడా క్లారిటీ లేదు.
కాని అక్సా ఖాన్ మరియు సుధీర్ లు కలిసి నటిస్తే మాత్రం దుమ్ము రేపే అవకాశం ఉందంటున్నారు.అక్సా ఖాన్ కు హీరోయిన్ కు ఉండాల్సిన లక్షణాలు అన్ని ఉంటాయి.
అందాల ఆరబోత విషయంలో ఈ అమ్మడు ఏమాత్రం ఉత్తరాది ముద్దుగుమ్మలకు తగ్గకుండా ఆకర్షిస్తుంది అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బుల్లి తెరపై ఆకట్టుకున్న వీరిద్దరు వెండి తెరపై ఆకట్టుకుంటారా అనేది చూడాలి.