ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా టాలీవుడ్ నటులపై విమర్శలు గుప్పించేందుకు సిద్దమవుతున్న సినీ నటి శ్రీ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.ఒకపక్క సుశాంత్ ఆత్మహత్య ఘటన తరువాత డ్రగ్స్ వ్యవహారం బయటపడడం అలానే మరోపక్క కన్నడ చిత్ర సీమలో కూడా డ్రగ్స్ వ్యవహారం వెలుగు చూడడం తో ఈ అమ్మడు మరోసారి రెచ్చిపోయింది.
ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు టాప్ హీరోలపై విమర్శలు గుప్పించి నిత్యం వార్తల్లో నిలిచే శ్రీ రెడ్డి తాజాగా ఒక వీడియో ను విడుదల చేసింది.టాలీవుడ్ లో కూడా డ్రగ్స్ వ్యవహారం బాగా ఉందని,వారి పేర్లు కూడా తెలుసు అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేసింది.
అంతేకాకుండా చాలామంది సెలబ్రిటీలు రేవ్ పార్టీలు నిర్వహిస్తూ పెద్ద పెద్ద హోటల్స్ ను అడ్డాగా చేసుకొని డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు అని సంచలన ఆరోపణలు చేసింది.ఇలాంటి పార్టీలకు వచ్చే అమ్మాయిలకు డ్రగ్స్ఇచ్చి వారిని సైతం వాడుకుంటారు అని కూడా శ్రీరెడ్డి ఆరోపించింది.
ఒకపక్క బాలీవుడ్, కన్నడ చిత్ర సీమలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతున్న సమయంలో శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి.తనకు భద్రత కల్పిస్తే టాలివుడ్ లో డ్రగ్స్ తీసుకొనే వారి పేర్లను సైతం బయటపెడతాను అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.
ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా పలువురు బడా హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న శ్రీరెడ్డి ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం పై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తో మరింత కలకలం రేపుతోంది.మరి ఈ అమ్మడు అన్నట్లుగా టాలీవుడ్ లోని కొందరి పేర్లు బయటపెడుతుందో లేదంటే ఇలా సంచలన వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుతుందో చూడాలి.