టూరిస్ట్‌లకు వెన్నులో వణుకు పుట్టించిన పాము.. వీడియో వైరల్

సాధారణంగా పామును ఆమడదూరంలో చూస్తేనే గుండెల్లో భయం పుట్టుకు వస్తుంది.అలాంటిది మనకి ఒక అడుగు దూరంలో పాము సంచరిస్తే.

 Snake That Causes Tremors In The Back Of Tourists  Video Goes Viral Viral Latest-TeluguStop.com

ఇంకేమైనా ఉందా పై ప్రాణాలు పైనే పోతాయి, కదూ ఇలాంటి భయానక ఘటనలకు సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా వీడియోలు చక్కర్లు కొట్టాయి.అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో మాత్రం మరింత భయానకంగా ఉంది.

ఈ వీడియో చూస్తుంటేనే గుండెల్లో దడ పుట్టుకొస్తోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఈ వీడియో ప్రకారం, కొందరు టూరిస్టులు సరదాగా ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రిషికేశ్‌లోని గంగా నదిపై సాహసోపేతమైన రైడ్‌కు వెళ్లారు.

బోట్‌లో ఎక్కి రివర్ రాఫ్టింగ్ చేస్తూ ప్రకృతి అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేశారు.

ఈ సమయంలోనే ఒక భారీ పాము నీటిలో ఈత కొడుతూ బోటు వైపుగా వచ్చింది.

చూడటానికి అది చాలా పెద్దగా భయంకరంగా ఉండటంతో సదరు పర్యాటకులు జడుసుకున్నారు.పాము ఎక్కడ బోట్‌ పైకి ఎక్కుతుందేమోనని బాగా బెదిరిపోయి గట్టి గట్టిగా కేకలు వేశారు.

దాంతో ఆ పాము కూడా బెదిరిపోయి తిరిగి వేరే వైపు వెళ్ళింది.అటువైపు కూడా మరో టూరిస్ట్ బోటు ఉండటంతో వారూ భయాందోళనకు గురయ్యారు.కానీ ఇది ఎవరికీ హాని చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

ఈ షాకింగ్ దృశ్యాలను ఒక టూరిస్ట్ వీడియో తీసి సోషల్ మాధ్యమాల్లో షేర్ చేశారు.దాంతో ఇది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది.ఆ పాము పది అడుగులకు పైనే పొడవు ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తూ షాక్ అవుతున్నారు.

వామ్మో ఆ పాము బోటుపైకి ఎక్కినట్లయితే.పర్యాటకుల పరిస్థితి ఏమయ్యేదో.

తలుచుకుంటేనే భయమేస్తోంది అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో రివర్ రాఫ్టింగ్ చేస్తుండగా జరిగింది.

ఈ ప్రాంతంలో ఇటీవలే వాటర్ గేమ్‌లు ప్రారంభమయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube