అన్ని రంగాల్లో నెంబర్‌వన్‌గా వున్న అగ్రరాజ్యం అమెరికా .దేశంలో నానాటికీ పెరుగుతున్న గన్ కల్చర్‌కు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతోంది.
నగదు, నగలు కోసం హత్యలు చేసేవారు కొందరైతే.జాతి, వర్ణ వివక్షలతో ఉన్మాదులుగా మారేవారు మరికొందరు.
ఏది ఏమైనా అక్కడ గన్ కల్చర్ వల్ల ఏటా వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.దీనికి చెక్ పెట్టాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నా.
శక్తివంతమైన గన్ లాబీ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటోందన్న వాదనలు వున్నాయి.ఇక తుపాకీ కాల్పుల్లో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు.
తాజాగా టెన్నెస్సీ రాష్ట్రంలోని నాష్‌విల్లేలోని ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా.నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల్లో ఇద్దరు టీనేజర్లు వున్నారని పోలీసులు తెలిపారు.అంతేకాదు కాల్పులకు గురైన ఆరుగురు వ్యక్తులు ఒకే కుటుంబానికి చెందిన వారని వెల్లడించారు.
వీరి వయసు 13 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఈ సంఘటన స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9.45 గంటల మధ్య జరిగి వుంటుందని మెట్రోపాలిటన్ నాష్‌విల్లే పోలీస్ డిపార్ట్‌మెంట్ ఓ ట్వీట్‌లో పేర్కొంది.మరణించినవారిని షెరెల్ (18), టవేరియస్ షెరెల్ (15)గా గుర్తించారు.
వీరి తల్లి (40), ఇద్దరు అక్కలు, సోదరుడు (13) కూడా ప్రమాదంలో గాయపడ్డారు.క్షతగాత్రులను నాష్‌విల్లేలోని వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు తరలించారు పోలీసులు.
ప్రస్తుతం వారి పరిస్ధితి నిలకడగా వుందని సమాచారం.
హత్యకు గురైన మూడో వ్యక్తిని నాష్‌విల్లేకే చెందిన క్రిస్టిన్ అకైల్ జాన్సన్ (29)గా పోలీసులు గుర్తించారు.అతను అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన ఇద్దరు అనుమానితుల్లో ఒకడిగా పోలీసులు చెబుతున్నారు.వీరిద్దరూ ఆయుధాలు ధరించి ఇంట్లోకి ప్రవేశించినట్లుగా సమాచారం.
కాల్పుల ఘటనలో మరణించిన జాన్సన్ ఒక దోపిడి దొంగగా చెబుతున్నారు.దొంగతనం చేసేందుకు వచ్చి వీరిద్దరూ కాల్పులకు తెగబడినట్లుగా అనుమానిస్తున్నారు.
అయితే తుపాకీ కాల్పులకు ముందు ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ శాఖ ప్రతినిధి క్రిస్టిన్ మమ్‌ఫోర్డ్ విలేకరులకు తెలిపారు. అపార్ట్‌మెంట్‌లోకి నిందితులు ప్రవేశించేముందు చూసినా.
ఈ ఘటన గురించి ఏవైనా వివరాలు తెలిసినా తక్షణం పోలీసులను సంప్రదించాలని ఆయన ప్రజలను కోరారు.పోలీసుల గణాంకాల ప్రకారం.
ఈ ఏడాది నవంబర్ 20 నాటికి నాష్‌విల్లే 491 మంది కాల్పుల ఘటనల్లో బాధితులుగా తేలారు.