టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ లలో హీరోయిన్ నిత్యా మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
ఈమె అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, సింగర్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.ఇంకా చాలా కాలం తరువాత నిత్యమీనన్ మళ్ళీ తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటోంది.
ప్రస్తుతం నిత్యామీనన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే త్వరలో విడుదల కానున్న స్కైలాబ్ సినిమాలో కూడా ఈమె ఒక రోల్ లో వచ్చింది.
సత్యదేవ్ నిత్యామీనన్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా వచ్చే నెల 4న విడుదలకానుంది.ఈ సందర్భంగా తాజాగా ఒక మీడియాతో ముచ్చటించిన నిత్యామీనన్ భీమ్లా నాయక్ సినిమా గురించి పలు విషయాలను పంచుకుంది.
అయ్యప్పనుమ్ కోషియం సినిమా రీమేక్ చేస్తున్నామని, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాల్ చేసి పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నామని చెప్పారు.ఆమెను ఆ సినిమాలో ఒక పాత్ర చేయాలని అడిగారు.అప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లేడీ పవన్ కళ్యాణ్ వస్తుంది అని పవన్ కళ్యాణ్ చెప్పారు.అలాగే మా ఇద్దరి కాంబినేషన్ బాగుంటుందని శ్రీనివాస్ చెప్పారు అని నిత్యామీనన్ చెప్పుకొచ్చింది.
అలాగే కళ్యాణ్ చాలా మౌనంగా ఉంటారు.ఎక్కువగా మాట్లాడరు అని తెలిపింది.