బోడి కోడి రికార్డులు సృష్టించడం ఏమిటని అనుకోవద్దు.అవును, మీరు విన్నది అక్షరాలా నిజమే.
సాధారణంగా ఒక కోడి ఒక రోజులో ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది.అదే అరుదైన కోళ్లు అయితే మహాకాకపోతే 2 గుడ్లు పెడతాయి.
అంతకమించి గుడ్లు పెట్టడం అయితే వాటివలన కాదు.ఇప్పటి వరకు అలాంటి వార్తలు కూడా మనం వినలేదు.
అయితే.ఓ కోడి ఏకంగా 31 గుడ్లు పెట్టింది.
అది కూడా 12 గంటల లోపే కావడం విశేషమే.చదవడానికి కాస్త విడ్డురంగా వున్నా ఇది నిజమని అంటున్నాడు ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ వ్యక్తి.
విషయంలోకి వెళితే, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లాలోని బాసోత్ గ్రామంలో గిరీశ్ చంద్ర బుధాని టూర్ అండ్ ట్రావెల్స్ సంస్థలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.అతడికి కోళ్లను పెంచడం అంటే మహా ఇష్టం.
అంటే మనం పాషన్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా… అదే అన్నమాట.ఈ క్రమంలోనే కొన్నాళ్ల క్రితం గిరీష్ రూ.200 పెట్టి 2 కోడి పిల్లలను కొన్నాడు.వాటికి వేరు శెనగలతో పాటు వెల్లుల్లి ఆహారంగా పెట్టేవాడు.
వాటిలో ఓ కోడి ఇటీవల రోజుకు 2 గుడ్లు పెడుతోంది.ఇది సాధారణ విషయమేనని అతడు మొదట పెద్దగా పట్టించుకోలేదు.

అయితే.డిసెంబర్ 25న అతడు ఇంటికి వచ్చే సరికి ఓ కోడి 5 గుడ్లు పెట్టిందని అతడి పిల్లలు చెప్పగా గిరీష్ ఆశ్చర్యపోయాడు.అలా ఆ కోడి ప్రతీ 10 -15 నిమిషాలకు ఒకటి చొప్పున మొత్తం 31 గుడ్లు పెట్టింది.దీంతో కుటుంబ సభ్యులు అందరూ అవాక్కయ్యారు.కోడికి ఏమైన వ్యాధి సోకిందేమోనని వెంటనే గిరీష్ దాన్ని డాక్టర్ వద్దకు తీసుకువెళ్లాడు.అయితే డాక్టర్ దాన్ని పరీక్షించి ఎలాంటి రోగం లేదని వైద్యుడు చెప్పడంలో ఊపిరి పీల్చుకున్నారు.
ఇక ఆ విషయం చుట్టు పక్కల వారికి తెలియడంతో ఒక వ్యక్తి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మీ కోడి పేరును నమోదు చేయండి అని సలహా ఇచ్చాడట.ప్రస్తుతం గిరీష్ ఆ పనిలోనే వున్నాడు.