వైరల్: చిరుతపులితో పెట్టుకుంటే ఎలా? అట్లుంటది దాంతోని!

సోషల్ మీడియా ప్రభావం జనాలమీద బాగానే వుంది.ముఖ్యంగా యూత్ అయితే చెప్పాల్సిన పనిలేదు.

 Viral: How To Deal With A Leopard Such A Thing ,tiger, Viral Latest, News Vira-TeluguStop.com

పొద్దున్నే లేవగానే ఇంకా కళ్ళు తెరవకుండానే సోషల్ మీడియా చూడనిదే వారికి రోజుగడవదంటే నమ్మితీరాలి.దాంతో వివిధ సోషల్ మీడియాలకు బాగానే గిట్టుబాటు అవుతోంది.

ఆ సంగతి పక్కనబెడితే నిత్యం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి.అయితే అందులో ఏ కొన్నో నెటిజన్లను మెప్పిస్తూ ఉంటాయి.

నేడు ఎక్కువగా జంతువులకు సంబంధించినటువంటి వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే చిరుత పులికి సంబందించినటువంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.

చిరుత గురించి అందరికీ తెల్సిందే.చిరుతలు బేసిగ్గా చాలా బలంగా ఉంటాయి.

వాటి కంటికి చిక్కినది దాదాపు గిట్టినట్టే.అంటే ప్రాణాలు గాల్లో కలిసినట్టే.

మరి అలాంటి చిరుతతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? కథ కంచికే కదా.ఇక్కడ కూడా అదే జరిగింది.వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి గమనిస్తే చిరుత మొదటి ఓ కొలను దగ్గరకు దాహం తీసుకోవడానికి వెళ్ళింది.ఇంతలో నీటిలో వున్న మొసలి చిరుతను వేటాడడానికి వచ్చింది.

మరి చిరుత ఊరుకుంటుందా? ఇంతలో చిర్రెత్తిన చిరుత నీటి నుంచి మొసలిని బయటకు ఈడ్చుకెళ్లింది.నోటితో గట్టిగా కరుచుకుని ఇక ఈరోజుకి మంచి ఆహారం దొరికింది అనుకొని అడవిలోకి తీసుకెళ్లిన విజువల్స్ ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.ఈ వీడియోను నేచర్‌ఫాండం ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల సంఖ్యలో వ్యూస్ రావడం విశేషం.ఇక లైక్స్ అయితే లెక్కపెట్టడం సాధ్యపడదు.ఒక యూజర్ కామెంట్ చేస్తూ… చిరుతపులితో పెట్టుకుంటే ఎలా? అట్లుంటది దాంతోని… అంటూ ఫన్నీగా కామెంట్ చేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube