Singer Mano : ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాళ్లపై పడి ఏడ్చిన మనో.. ఏం జరిగిందంటే?

సింగర్ గా, నటుడిగా, రియాలిటీ షోలకు జడ్జిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మనోకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.మనో తాజాగా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఈ సినిమాతో నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నారు.

 Shocking Facts About Singer Mano Film Career Details Here , Singer Mano, Film Ca-TeluguStop.com

అయితే మనో ఈ స్థాయికి రావడం వెనుక ఎన్నో కష్టాలున్నాయి.రజనీకాంత్ కు తెలుగులో డబ్బింగ్ చెప్పడం ద్వారా మనో తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు.

రజనీకాంత్ కు మనో వాయిస్ సూట్ అయిన స్థాయిలో మరెవరి వాయిస్ సూట్ కాదనే సంగతి తెలిసిందే.ఒక ఇంటర్వ్యూలో మనో మాట్లాడుతూ విజయవాడలో నేను సంగీతం నేర్చుకున్నానని ఆ సమయంలో దాసరి నారాయణరావు గారు నాలుగు సినిమాలలో నటుడిగా అవకాశం ఇప్పించారని మనో పేర్కొన్నారు.

ఒక సినిమాలో హీరో తల్లి పాత్ర కోసం మా అమ్మ సెలెక్ట్ అయ్యారని మనో వెల్లడించారు.

ఆ సినిమాలో నాకు కూడా ఛాన్స్ కావాలని దాసరి గారి కాళ్లపై పడ్డానని మనో పేర్కొన్నారు.

నేను ఆ పాత్రకు సూట్ కానని దాసరి చెప్పడంతో నేను ఏడ్చానని మనో పేర్కొన్నారు.ఆ సినిమాలో ఛాన్స్ రావడంతో నాకు ఆనందం వేసిందని ఆ సినిమాతో నా లైఫ్ టర్న్ అయిందని మనో పేర్కొన్నారు.

ఆ తర్వాత మ్యూజిక్ కు సంబంధించిన చాలా విషయాలను నేర్చుకున్నానని మనో చెప్పుకొచ్చారు.

Telugu Career Troubles, Dasari, Artist, Career, Mano-Movie

మనో కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మనో తక్కువ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.మనో భవిష్యత్తులో కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మనోకు సింగర్ గా బాగానే రెమ్యునరేషన్ దక్కుతోంది.ఎస్పీ బాలు వల్లే తనకు ఆశించిన స్థాయిలో సింగర్ గా గుర్తింపు దక్కలేదని మనో భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube