లోకేష్ కనగరాజ్.ఈ పేరు ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ అనే చెప్పాలి.
ఇతడు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో దూసుకు పోతున్నాడు.ఇక ఇటీవలే కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ సినిమాతో అయితే పాన్ ఇండియా వ్యాప్తంగా ఇమేజ్ తెచ్చుకున్నాడు.
కమల్ హాసన్ కు ఎన్నో రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ అందించి కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.
ఇక ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ ఎవరితో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో లోకేష్ విజయ్ దళపతితో సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు.
వీరి కాంబోలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కనుంది.విజయ్ కెరీర్ లో 67వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై తాజాగా ఒక అప్డేట్ వచ్చింది.
ఇప్పటికే వీరి కాంబోలో తెరకెక్కిన మాస్టర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతిని పెట్టి మంచి విజయాన్ని అందించాడు.ఇప్పుడు మరో స్టార్ హీరోను నెక్స్ట్ సినిమా కోసం రంగంలోకి దించుతున్నట్టు కోలీవుడ్ మీడియా గుసగుసలు ఆడుతుంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం లోకేష్ విజయ్ సినిమాలోని విలన్ పాత్ర కోసం స్టార్ హీరోను సంప్రదించాడట.
స్టార్ హీరో అయినా విశాల్ ను విలన్ పాత్ర కోసం లోకేష్ కనకరాజ్ సంప్రదింపులు చేసాడని టాక్.విశాల్ మొదటి నుండి కూడా విభిన్నమైన పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తాడు.మరి ఈసారి ఇతడికి విలన్ గా నటించేందుకు అవకాశం రావడంతో ఒక చెప్పాడని కూడా వార్తలు వస్తున్నాయి.ఇలా విలన్ పాత్రకు ఓకే చెప్పడంతో లోకేష్ కథ కూడా వినిపించాడని.
కథ నచ్చితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయం అంటున్నారు.మరి తెలుగులో కూడా మార్కెట్ ఉన్న విశాల్ విలన్ గా నటిస్తే ఈ సినిమాకు కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది.