వైసీపీ మంత్రులు గత కొద్ది రోజుల నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడుతూ ఉన్నారు.“విశాఖ గర్జన” తర్వాత పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరుపై విమర్శలు చేస్తూ ఉన్నారు.నిన్ననే వైసీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మరియు మంత్రులు ఇంకా ఎమ్మెల్సీలు రాజమహేంద్రవరంలో సమావేశమయ్యారు.ఈ సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీపై పరోక్షంగా సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఇక తాజాగా వైసీపీ పారిశ్రామిక మంత్రి గుడివాడ అమర్నాథ్ .జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు.పవన్ కళ్యాణ్ కంటే ప్రజాశాంతి పార్టీ నాయకుడు కేఏ పాల్ నయమని ఎద్దేవా చేశారు.జనసేన కార్యకర్తలు త్వరలో చంద్రబాబుకి బానిసలుగా మారనున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
వంగవీటి రంగా హత్య గురించి పవన్ మాట్లాడటం అనైతికమని అన్నారు. చంద్రబాబునీ ముఖ్యమంత్రి చేయడమే పవన్ కోరిక అని… గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు.