హైదరాబాద్ ఆదర్శనగర్ హిల్ ఫోర్ట్ ప్యాలెస్ నిర్లక్ష్యంపై తెలంగాణ హైకోర్టు మండిపడింది.మరమ్మత్తులు చేయాలన్న ఆదేశాలను పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మేరకు ఫైనాన్స్ సెక్రెటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్, హెచ్ఎండీఏ కమిషనర్ ఈనెల 22న ధర్మాసనం ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది.