ఏపీలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ వేరే వాళ్లను ఫాలో అవ్వడమే ఎక్కువుగా చేస్తూ ఉంటారు.ఇప్పుడు కూడా ఆయన అదే చేయబోతున్నారా ? అంటే అవుననే ఆన్సర్లే వినిపిస్తున్నాయి.వైఎస్సార్ కుమార్తె షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తోంది.ఆమె అక్కడ ఎంట్రీ ఇవ్వడంతో పాటు కొత్త పార్టీ పెడుతుందన్న వార్తలు తెలంగాణ రాజకీయాలను ఓ కుదుపు కుదుపుతున్నాయి.
తెలంగాణ పాలిటిక్స్‌లో షర్మిల ఎంట్రీపై ఇటు చంద్రబాబు అనుచరగణంలో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోందట.
హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టానని చంద్రబాబు చెప్పుకుంటారు… ఆయన ప్రచారం చేసుకున్నంత కాకపోయినా ఆ నగరానికి గుర్తింపు రావడంలో చంద్రబాబు కృషి అయితే ఉంది.
అంత క్రేజ్ ఉన్నా కూడా చంద్రబాబు అక్కడ వరుస ఎదురు దెబ్బలతో పార్టీని అర్దాంతరంగా వదిలేశారు.ఇప్పుడు షర్మిల అక్కడ ఎంట్రీ ఇస్తుండడంతో చంద్రబాబు సైతం షర్మిలకు పోటీగా కొత్త అస్త్రం వదిలి పెడుతున్నట్టు తెలుస్తోంది.
చంద్రబాబు కోడలు, నందమూరి బాలక్రిష్ణ కుమార్తె నారా బ్రాహ్మణిని తెలంగాణా రాజకీయాల్లోకి ప్రవేశపెట్టాలని బాబు మీద వత్తిడి పెరుగుతోంది అంటున్నారు.

షర్మిల పార్టీ పెడితే తెలంగాణలో కొన్ని సామాజిక వర్గాలు ఆమెకు దగ్గర అవుతాయని అంచనాలు ఉన్నాయి.ఇప్పుడు బ్రాహ్మణి విషయంలోనూ అదే జరుగుతుందా ? హైదరాబాద్ లోనే పుట్టి పెరిగి మహిళా పారిశ్రామికవేత్తగా సక్సెస్ అవుతోన్న ఆమె నందమూరి ఆడపడుచుగా.ఇటు నారా కోడలిగా వారధి అవుతారన్న అంచనాలు టీడీపీ వర్గాల్లో ఉన్నాయి.
అందుకే ఆమెను అక్కడ దింపాలని బాబుపై ఒత్తిడి వస్తోందంటున్నారు.తెలంగాణలో టీఆర్ఎస్‌ను గద్దె దించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కాచుకుని ఉన్నాయి.
ఈ టైంలో షర్మిల అక్కడ కొత్త పార్టీ పెట్టి… దానికి పోటీగా బ్రాహ్మణి కూడా రంగంలోకి దిగితే ఆంధ్రా ఓటర్లతో పాటు సామాజిక వర్గాల వారీగా చీలిక వచ్చి తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కడం ఖాయం.