తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పంలో మహిళలతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జగన్ ప్రభుత్వం కల్తీ మద్యం అమ్ముతూ ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంచుతున్నారు అని సీరియస్ కామెంట్స్ చేశారు.
తెలుగుదేశం పార్టీ( DP ) అధికారంలోకి రాగానే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.లోకల్ బ్రాండ్స్ తో వైసీపీ ప్రభుత్వం ( YCP Govt )ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది.
టీడీపీకి ఓటు వేస్తేనే భర్తలకు అన్నం పెట్టాలని పిలుపునిచ్చారు.అంతేకాకుండా కుప్పంలో లక్ష మెజార్టీతో తెలుగుదేశం గెలుస్తుందని చెప్పారు.
తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తానని చంద్రబాబు తెలిపారు.ఇదిలా ఉంటే కుప్పంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో మద్యం గురించి చంద్రబాబు మాట్లాడటం పై వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవి( YCP MLA Shilpa Ravi ) ఫైర్ అయ్యారు.నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారం కోసం రోజురోజుకు చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.నాణ్యమైన మద్యం అందిస్తామని బాబు మహిళలతో చెప్పటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
తక్కువ ధరకు కాదు చంద్రబాబుకు చేతనైతే మద్యపాన నిషేధం అమలు చేయాలని సవాల్ చేశారు.మహిళల సభలో చంద్రబాబు( Chandrababu Naidu ) మద్యం గురించి మాట్లాడటం దిగజారుడు చర్యేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.