టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన పాదయాత్రకు రెఢీ అవుతున్నారు.నిర్విరామంగా పాదయాత్ర చేయకుండా.
విడతల వారీగా రాష్ట్రాన్ని చుట్టేయాని భావిస్తున్నారు.ఇప్పటికే తన రూట్ మ్యాప్ కు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు.
ఈ నెల 6 నుంచి తన పాదయాత్ర మొదలు పెడతానని ప్రకటించారు.అంతే కాకుండా.
సీతక్క ప్రాతినిథ్యం వహిస్తోన్న ములుగు నియోజకవర్గంలోని మేడారం నుంచి ప్రారంభించాలని ముహూర్థం ఖరారు చేశారు.అంతే కాకుండా మొదటి విడతలో 60 రోజులు మాత్రమే యాత్ర చేయాలని ఫిక్స్ అయ్యారు.
రేవంత్ యాత్రపై సీనియర్లు సైతం గుర్రుగా ఉండటంతో.మొదటి విడుత పాదయాత్ర ముగిసిన తర్వాత.పార్టీ రిజల్ట్స్ ను వారికి చూపించి వారిని రెండో విడత యాత్రకు సిద్దం చేయాలని భావిస్తున్నారు.సీనియర్లు మాత్రం క్రెడిట్ మొత్తం రేవంత్ ఎక్కడ కొట్టే స్తారో అనే భయంలో ఉన్నట్టు తెలుస్తోంది.
మొత్తం 119 నియోజక వర్గాలకు గానూ మొదటి విడతలో రేవంత్ కేవలం 50 నియోజకవర్గాలనే ఫోకస్ చేయనున్నారు.పార్టీ కేడర్లో ఉత్సాహం నింపుతూనే.యువతపై ఫోకస్ చేయనున్నారు.
రేవంత్ రెడ్డిను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న నేతలంతా తిరిగి ఒక్కతాటి మీదకు వస్తుండటం కొంతమేరకు రేవంత్ కు కలిసొచ్చే అంశమే.అయితే సీనియర్లు సీటుకు ఎసరు రానంత వరకూ మాత్రమేనని విశ్లేషకులు అంటున్నారు.ఇక సీనియర్ల విషయాన్ని రేవంత్ రెడ్డి పట్టించుకోవడమే మానేసి.
కేవలం పార్టీ గెలుపుపైనే ఫొకస్ పెట్టినట్టు తెలుస్తోంది.ఇందులో భాగంగా.
మొదటి విడత రేవంత్ రెడ్డి ఏయే నియోజకవర్గాలను టచ్ చేస్తారు ? అక్కడ కాంగ్రెస్ నేతలు, శ్రేణుల నుంచి ఆయనకు ఏ రకమైన స్పందన లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.