నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అన్న గారి జీవిత చరిత్ర “కథానాయకుడు” సినిమా ఇటీవలే విడుదలయ్యి హిట్ టాక్ సంపాదించుకున్న సంగతి అందరికి తెలిసిందే.సినిమా చూసిన వారందరు బాలయ్య గారు అన్న గారి లాగే ఉన్నారు అన్నారు.
తెలుగు సినిమా రంగంలో గొప్ప హీరో అంటే ఇప్పటికి అన్న గారి పేరే చెబుతారు.అలాంటి అన్న గారు సినిమా రంగంలో ఎన్ని కష్టాలు పడ్డారు ఈ సినిమాలో చక్కగా చూపించారు.
అక్కినేని నాగేశ్వర రావు గారి పాత్రలో సుమంత్ పరవాలేదు అనిపించారు.
ఇక అసలు విషయానికి వస్తే…అక్కినేని నాగేశ్వర రావు, నందమూరి తారక రావు గారి కాంబినేషన్ లో వచ్చిన “గుండమ్మ కథ” సినిమా అప్పట్లో ఎంత సంచలనమైందో కొత్తగా చెప్పనవసరం లేదు.
అయితే కథానాయకుడు సినిమాలో గుండమ్మ కథ లోని ఓ సన్నివేశం చూపించారు.బుల్లమ్మ (సావిత్రి) తో కలిసి పని చేస్తూ అన్న గారు పాడిన లేచింది నిద్ర లేచింది మహిళా లోకం సాంగ్.
ఆ షూటింగ్ సమయంలో మొట్ట మొదటిసారి సావిత్రి గారు రెండో టేక్ అడిగారు.కారణం ఆమె అక్కినేని గారు అన్న మాటలకు చింతించడం.అదే మధన పడుతూ షూటింగ్ పై శ్రద్ధ పెట్టలేకపోయారు.అప్పుడు అన్న గారు అక్కినేని గారి మాటలు నిజమే అని చెప్పారు.
సంపాదించిన డబ్బుకి కాపలా మనమే ఉండాలి అని చెప్పారు.

మహానటి సినిమాలో ఈ సన్నివేశం చూపించలేదు.సావిత్రి గారిలోని మంచితనం మాత్రమే చూపించారు.కాస్త డబ్బు రాగానే కొద్దిగా పొగరుగా అక్కినేని నాగేశ్వర రావు గారికి బ్లాంక్ చెక్ ఇచ్చారు సావిత్రి గారు.
హైదరాబాద్ కి అక్కినేని గారు షిఫ్ట్ అయ్యేటప్పుడు మద్రాస్ లోని తన పాత ఇంటిని కొనుక్కోడానికి సావిత్రి గారు అక్కినేని గారికి బ్లాంక్ చెక్కారు.అలా అహంకారం ప్రదర్శించటంతో అక్కినేని గారు సావిత్రిపై కోపోద్రుక్తులై అక్కడినుండి వెళ్ళిపోతారు.

తర్వాత అన్న గారు సావిత్రమ్మ కి మన డబ్బుకి మనమే కాపలా ఉండాలి అని చెప్తారు.అనవసరమైన దానాలు చేయొద్దు అంటారు.నిజానికి సావిత్రి గారు జీవితంలో చేసిన తప్పు అదే.వ్యసనాలకు అలవాటుపడిన వారికి కూడా దానాలు చేసేసారు.నిజమో అబద్ధమ్మో తెలుసుకోకుండా చిక్కుల్లో పడ్డారు.అంత కష్టపడి సంపాదించిన ఆస్తి చివరికి ఇన్కమ్ టాక్స్ వాళ్ళు జప్తు చేసారు.కానీ ఈ విషయంలో అన్న గారు చాలా జాగ్రత్త పడ్డారు.తెలుగు దేశం పార్టీ పెట్టేముందు తన ఇంటి పై ఐటీ రైడ్ జరిగినా లెక్కలు అన్ని కరెక్ట్ గా చూపించారు.
అది అన్న గారి దేశభక్తికి ఓ నిదర్శనం.