కూతుర్ని అంగన్‌వాడికి పంపుతున్న కలెక్టర్..! ఎందుకో తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

మనకి రోజు గడవడానికి డబ్బులు ఉన్నా లేకపోయినా…పిల్లలను మాత్రం మంచి పాఠశాలల్లో చదివించాలని అనుకుంటాము.పెద్దవారైనా ఎంతో కష్టపడి…ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలని పంపించకుండా…భారీ ఫీజుల భారం మోస్తూ ప్రైవేట్ స్కూల్స్ కి పంపిస్తున్నారు.

 Tirunelveli Collector Puts Daughter In Anganwadi Not Private School-TeluguStop.com

అలాంటి కలెక్టర్ పదవిలో నుండి తన కూతురుని అంగన్వాడిలో చేర్పించి హ్యాట్సాఫ్ అనిపించుకున్నారు తమిళనాడులోని ఓ మహిళా కలెక్టర్.వివరాలలోకి వెళ్తే.

శిల్పా ప్రభాకర్‌ సతీష్‌ తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.తన కుమార్తెను అందరిలానే ప్రైవేట్‌ ప్లే స్కూల్‌కు పంపించకుండా తన ఇంటికి సమీపంలోని అంగన్‌వాడి కేంద్రానికి పంపిస్తున్నారు.ఈ విషయం గురించి శిల్ప మాట్లాడుతూ.‘నా కూతురు నలుగురితో కలిసిమెలసి ఉండాలని భావిస్తున్నాను.ఈ ఆర్థిక, సామాజిక బేధాలు తనపై ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ చేర్చాను.ఇవేకాక తాను చాలా త్వరగా తమిళం నేర్చుకోవాలని భావించి ఇక్కడకు పంపుతున్నాను’ అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలంటే ప్రజల్లో ఉన్న చిన్నచూపును తొలగించడానికి ఆమె ఈ నిర్ణయం తీసుకుంది.అంగన్‌వాడి బళ్లు కూడా శుభ్రంగానే ఉంటున్నాయని, పిల్లలను పంపాలని ఆమె చెబుతున్నారు.‘నా బిడ్డ కూడా అందరి పిల్లల్లాంటిదే.అందరితో కలిసిమెలసి ఉండాలని అంగన్‌వాడి సెంటర్‌కు పంపుతున్నాను.నర్సరీ స్కూళ్లలో మాదిరే అక్కడా అన్ని సదుపాయాలూ ఉన్నాయి.శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారు.

పిల్లలను ఆడిస్తారు, చదివిస్తారు.అంగన్‌వాడి సెంటర్లను మరింత అభివృద్ధి చేయాలి’ అని శిల్ప చెబుతున్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube