సాధారణంగా మనం గుడి, ఫంక్షన్ హాల్ లేదా ఇంట్లో వివాహం చేసుకుంటాం కదా, కానీ ఓ జంట మాత్రం సముద్రం( Sea )లో డైవ్ చేస్తూ వివాహం చేసుకున్నారు.వీళ్ళిద్దరూ సముద్రంలో డైవ్ చేయడం చాలా ఇష్టపడతారట.
అందుకే వారి వివాహాన్ని సముద్రంలోనే చేసుకున్నారు.డైవింగ్ ఎంత ఇష్టం ఉంటే ఏంటి గానీ మరి ఇలా సముద్రంలోకి దూకేస్తారా అని చాలామంది వారిని సరదాగా ఆటో పట్టిస్తున్నారు.
వీళ్లు ఎర్ర సముద్రం( Red Sea )లో నీటి అడుగున పెళ్లి చేసుకున్నారు.హసన్ అబు అల్-ఓలా, యాస్మిన్ దఫ్తార్దార్ ( Hassan Abu Al-Ola , Yasmine Daftardar )ఇద్దరూ అనుభవజ్ఞులైన డైవర్లు.
జెద్దాలోని ప్రవాళ శిఖరాలు, సముద్ర జీవుల మధ్య ఈ వివాహం చేసుకోవడం తమకెంతో ఆనందంగా ఉందని వారు చెబుతున్నారు.
ఈ పెళ్లిని లోకల్ డైవర్ల టీమ్ నిర్వహించింది.ఈ యాత్రకు నాయకుడు ఫైసల్ ఫ్లెంబాన్.సముద్రంలో డైవ్ చేయడానికి కావాల్సిన ప్రాథమిక వస్తువులను ఈ జంటకు డైవర్ల టీమ్ అందించింది.
అంతేకాకుండా, సముద్రం లోతుల్లోనే వారి వివాహం జరిపించే ఏర్పాట్లు చేశారు.ఇతర డైవర్లు కూడా ఈ వేడుకలో పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ విషయం గురించి హసన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “మేం సిద్ధంగా ఉన్నప్పుడు, కెప్టెన్ ఫైసల్, టీమ్ మా వివాహాన్ని సముద్రం లోతుల్లోనే జరుపుకోవాలని నిర్ణయించారని చెప్పారు.ఇది చాలా అందమైన, మరచిపోలేని అనుభవం” అని అన్నారు.
ఈ ప్రత్యేక సందర్భంలో, యాస్మి( Yasmine Daftardar )న్ ఒక తెల్లటి ప్రవాహంలా ప్రవహించే గౌను ధరించగా, హసన్ ఒక ఫార్మల్ బ్లాక్ టక్సీడో ధరించి, దానితో పాటు డైవింగ్ గేర్ కూడా ధరించారు.ఈ కార్యక్రమం చాలా సజావుగా జరిగినందుకు హసన్ కృతజ్ఞతలు తెలిపారు.“ఎలాంటి సమస్యలు లేకుండా ఈ కార్యక్రమం చాలా సజావుగా జరిగింది.ఇది ఎంతో అసాధారణమైన, అద్భుతమైన విషయం అని అందరూ ఆశ్చర్యపోయారు” అని ఆయన అన్నారు.
ఇదే సందర్భంగా వారు సముద్ర జీవుల ప్రొటెక్షన్ కోసం అందరూ పాటుపడాలని కోరారు.సముద్రం లోపల అద్భుతమైన ప్రపంచం ఉంటుందని దానిని నాశనం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.