రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి ( Boinpalli )తాసిల్దారు గా నారాయణరెడ్డి ( Narayana Reddy )బుధవారం బాధ్యతలు తీసుకున్నారు .ఇక్కడ పనిచేస్తున్న తహసిల్దార్ పుష్పలతను జిల్లా కలెక్టర్ బదిలీ చేయగా మహబూబాబాద్ నుంచి జిల్లాకు కేటాయించిన నారాయణరెడ్డిని బోయినపల్లి తాహాసిల్దార్ గా నియమించారు.
ఇసుక రవాణా వే బిల్లు ల జారి ఇతర విషయాల్లో ఆరోపణలతో తాసిల్దార్ ను బదిలీ చేసినట్లు ప్రచారం కొనసాగుతుంది.ఆరోపణలపై వేములవాడ ఆర్డిఓను విచారణ అధికారిగా నియమించినట్లు సమాచారం.
బదిలీ చేసిన తహసిల్దార్ పుష్పలతకు ఎక్కడా పోస్టింగ్ కేటాయించలేదు