యువ హీరో కిరణ్ అబ్బవరం లీడ్ రోల్ లో గోపీనాథ్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా సమ్మతమే. జూన్ 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో చాలా కష్టపడ్డారట చిత్రయూనిట్.
సినిమా సెట్స్ మీదకు వెళ్లే టైం నుండి దాదాపు హీరోయిన్ కోసమే ఐదారు నెలలు దాకా టైం తీసుకున్నారట.చాలామంది హీరోయిన్స్ నుండి రిజెక్షన్స్ కూడా ఫేస్ చేశారట చిత్రయూనిట్.
ఫైనల్ గా తెలుగు అమ్మాయి చాందిని అయితే ఈ పాత్రకు పర్ఫెక్ట్ అని ఆమెని ఫైనల్ చేశారట.
ఇక సినిమా విషయానికి వస్తే సమ్మతమే అనే సాఫ్ట్ టైటిల్ తో ఓ మంచి ప్రయత్నం చేశామని చెబుతున్నారు చిత్రయూనిట్.
అయితే టైటిల్ క్లాస్ గా ఉన్నా సరే సినిమాలో ఆడియెన్స్ కి కావాల్సిన మాస్ అంశాలు కూడా ఉంటాయని చెబుతున్నారు.కిరణ్ అబ్బవరం, చాందినిల జోడీ సినిమాకు హైలెట్ గా ఉంటుందని అంటున్నారు.
సెబాస్టియన్ తో అంచనాలను అందుకోలేని కిరణ్ అబ్బవరం సమ్మతమే తో ఆడియెన్స్ నుంచి సమ్మతం పొందుతాడా లేదా అన్నది చూడాలి. కిరణ్ అబ్బవరం మాత్రం ఈ సినిమాతో పక్కా హిట్ కొట్టేస్తాం అని నమ్మకంగా ఉన్నాడు.