Samantha : దేవకన్యలా మెరిసిపోతున్న సమంత.. ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పరసగా అవకాశాలను అందుకుంటు స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

 Samantha Beauty In Shaakuntalam Look-TeluguStop.com

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఇటీవలే యశోద సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సమంత ఈ సినిమాతో మరో హిట్ సినిమాను ఖాతాలో వేసుకుంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన శాకుంతలం( Shaakuntalam ) సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని సమంత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ గుణశేఖర్( Gunasekhar ) దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ పాటలు పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కానుండగా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్ ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు.

ఒకవైపు ప్రమోషన్స్ లో పాల్గొంటూనే మరోవైపు వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించిన కొత్త కొత్త పోస్టర్లను మూవీ మేకర్స్ విడుదల చేస్తున్నారు.తాజాగా చిత్ర బృందం సినిమాలో సమంతకు సంబంధించిన కొన్ని పోటోలను విడుదల చేశారు.ఆ ఫోటోలను సమంత బంగారు వర్ణం దుస్తుల్లో చూడడానికి బంగారు పూత పూసుకున్న ఒక దేవ కన్యలా మెరిసిపోతోంది.

బంగారు వర్ణం దుస్తులు ఒంటినిండా బంగారు నగలతో కుందనపు బొమ్మలా మెరిసిపోతోంది.నిజంగా బంగారు బొమ్మ దిగివస్తే ఇలాగే ఉంటుందా అని అనిపించే విధంగా సమంత ఫోటో అభిమానులు,నెటిజన్స్ దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube