ఐరోపాలోనే( Europe ) అతిపెద్ద అణువిద్యుత్తు కేంద్రమైన జపొరిజియాలో ( Zaporizhia )పేలుళ్లను జరిపేందుకు రష్యా దళాలు కుట్ర చేస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ( Zelensky ) తాజాగా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం జరిగింది.అణు రియాక్టర్‌కు అత్యంత సమీపంలోనే పేలుడు పదార్థాలను అమర్చాయని ఈ సందర్భంగా వెల్లడించారు.
నీపర్ నది ఒడ్డున ఉన్న ఈ నగరం ప్రస్తుతం రష్యా దళాల ఆధీనంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.ఇక్కడి అణుకేంద్రంలో పేలుడు పదార్థాలను పోలిన వస్తువులను ప్లాంట్ పైకప్పునకు అమర్చినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ఉటంకిస్తూ జెలెన్‌స్కీ ఈ సందర్భంగా పేర్కొనడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా తాను ఈ విషయం చెబుతున్నట్లు కూడా వెల్లడించారు.ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో( French President Macron ) భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు జెలెన్‌స్కీ.ఈ అణుకేంద్రం నుంచి రేడియేషన్‌ను లీక్ చేసే ముప్పు కూడా పొంచిఉందని ఆయన ఆందోళనలు వ్యక్తం చేశారు.మరోవైపు ఉక్రెయిన్ సైన్యం( Army of Ukraine ) కూడా ఇటువంటి ప్రకటనే చేసింది.
అణుప్లాంట్‌లోని 3, నాలుగు రీయాక్టర్లలోని పైభాగంలో పేలుడు పదార్థాలు అమర్చినట్లు వెల్లడించింది.భవిష్యత్తు ఈ పరిణామాలను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.”ఈ అణు రియాక్టర్లను వారే ధ్వంసం చేస్తారు.ఉక్రెయిన్ షెల్లింగ్‌లో దెబ్బతిన్నట్లు చిత్రీకరిస్తారు” అని సైన్యం ఓ ప్రకటనలో పేర్కోవడం గమనార్హం.
మరో వైపు రష్యా( Russia ) మాత్రం ఉక్రెయినే అణువిద్యుత్తు కేంద్రంపై దాడికి యత్నిస్తోందని కౌంటర్ ఇచ్చింది.అణువ్యర్థాలతో కూడిన పేలుడు పదార్థాలతో ప్లాంట్‌పై దాడి చేయాలని కీవ్ యోచిస్తోంది.”జులై 5వ తేదీ రాత్రి ఉక్రెయిన్ మిలటరీ జపొరిజియా పై దీర్ఘశ్రేణి ఆయుధాలు, ఆత్మాహుతి డ్రోన్లతో దాడి చేస్తుంది” అని రష్యా మీడియాలో అనేక కథనాలు వస్తున్న పరిస్థితి.ఇక ఇరు దేశాలమధ్య యుద్ధం స్టార్ట్ అయి సంవత్సరంన్నర కావస్తోంది.
అయినా వారిలో ఏ ఒక్కరు వెనక్కి తగ్గడం లేదు.ఇలా అయితే ఇరు దేశాల భవితవ్యం చాలా దయనీయంగా మారబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కానీ ఎవరి హెచ్చరికలు వినే పరిస్థితిలో వారు లేనట్టు కనబడుతోంది.