అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బిడెన్ పాలనపై పూర్తి స్థాయిలో పట్టు పెంచుకునే పనిలో పడ్డారు.ఇప్పటికే అధికారాల బదిలీల విషయంలో తనదైన ముద్ర వేస్తున్న బిడెన్ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
జనవరి 20 న ట్రంప్ పదవీ కాలం ముగియనుండటంతో అదే రోజు బిడెన్ భాద్యతలు తీసుకోవడానికి సిద్దంగా ఉన్నారు.శ్వేత సౌధంలో అదే రోజున అడుగు పెట్టడానికి కూడా బిడెన్ రెడీ గా ఉన్నారని తెలుస్తోంది.
ఇదిలాఉంటే తనకు ముందు నుంచీ అత్యంత సన్నిహితులుగా ఉన్న వారిని బిడెన్ అందలం ఎక్కిస్తున్నారు.
ఎన్నో ఏళ్ళుగా అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాన్ క్లెయిన్ కు వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా పదవిని అప్పగించారు.
ఇది అత్యంత శక్తివంతమైన పదవి కాడంతో తనకు అత్యంత సన్నిహితుడు, సమర్దుడుకే బిడెన్ అప్పగించినట్టుగా బిడెన్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటే మామూలు విషయం కాదు.
ఎంతో అలెర్ట్ గా ఉంటూ ఉండాలి.అధ్యక్షుడి ప్రతీ విషయంపై స్పష్టమైన అవగాహన ఉండాలి.
అత్యంత భాద్యతాయుతంగా ఉండాలి, అధ్యక్షుడి రోజు వారి కార్యక్రమాలు చూసుకోవాలి.అంతేకాదు

ప్రభుత్వం ముందు ఉండే సవాళ్ళను, సమస్యలను ఎదుర్కొనే శక్తివంతమైన వ్యక్తులను ఎన్నుకునే విషయంలో అధ్యక్షుడికి కీలకంగా వ్యవహరించలి.అందుకే ఈ పదవిలో ఉన్నవారిని ప్రెసిడెంట్ గెట్ కీపర్ అని పిలుస్తారు.ఇదిలాఉంటే బిడెన్ తన సహచరుడు గురించి మాట్లాడుతూ రాన్ క్లెయిన్ తనకు సహచరుడు అని మాత్రమే నేను ఈ పదవి ఇవ్వలేదని స్పష్టం చేశారు.ఎన్నో ఏళ్ళుగా ఇద్దరం కలిసి పనిచేశామని, ఎంతో అపారమైన అనుభవం క్లెయిన్ సొంతమని అన్నారు.2014 లో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని కలిసికట్టుగా అధికగమించాం ప్రస్తుతం ఈ పదవికి ఆయన్ని మించిన వారు నాకు కనపడలేదు అంటూ క్లెయిన్ పై తన అభిమానాన్ని నమ్మకాన్ని చాటుకున్నారు బిడెన్.