మందుబాటిల్​ లాగించేస్తున్న ఎలుక.. ఇదేం చిత్రం..

సాధారణంగా మందు ఎవరు తాగుతారు? ఇదేం ప్రశ్న అంటున్నారా ? మనుషులు తాగుతారు అందులోను మగవారు ఎక్కువగా తాగుతుంటారు.కొన్ని చోట్ల మహిళలు కూడా తాగుతుంటారు అనుకోండి అది వేరే విషయం.

 Rats Group Emptied Twelve Wine Bottles In A Wine Shop In Tamil Nadu , Rat, Wine,-TeluguStop.com

అయితే ఓ చోట ఓ ఎలుకల గుంపు మాత్రం బాటిళ్లు బాటిళ్లు లాగించేశాయి.ప్రస్తుతం ఈ టాపిక్​ సోషల్​ మీడియాలో హల్​ చల్​ చేస్తోంది.

ఎలుకలు మందు తాగిన ఘటన తమిళనాడులో జరిగింది.నీలగిరి జిల్లాలోని కందపూజ ప్రాంతంలో ఈ విచిత్రం చోటు చేసుకుంది.ఆ ప్రాంతంలో తమిళనాడు మద్యం దుకాణం నడుపుతోంది.అయితే కరోనా కారణంగా కొన్ని రోజులు దానిని మూసివేశారు.

కొన్ని రోజులు తరువాత ఆ మందు దుకాణాన్ని అధికారులు తెరిచారు.అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు.

అందులో ఉన్న 12 వైన్​ సీసాలు ఖాళీగా కనిపించాయి.వాటి మూతలపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు కనిపించాయి.

దీంతో 12 వైన్​ బాటిళ్లను ఎలుకలే తాగేశాయని నిర్ధారణకు వచ్చారు ఆ తమిళనాడుకు చెందిన ఎక్సైజ్​ అధికారులు.అయితే విచిత్రం ఏంటంటే ఆ ఎలుకలు కేవలం వైన్​ బాటిళ్లను మాత్రం ముట్టుకున్నాయి.

Telugu Corona, Excise Officers, Kandapooja Area, Neelagiri, Rats Drunk Wine, Twe

బీరు, ఇతర మందు బాటిళ్ల జోలికి అస్సలు పోలేదు.వాటికి కేవలం వైన్​ నచ్చింది కావచ్చు అని సోషల్​ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.మీరు కూడా తాగడం మొదలు పెడితే ఇక మా మనుషులకు ఎక్కడ మందు దొరుకుంతుంది మూషిక మహారాజా అంటూ జోకులు వేస్తున్నారు నెటిజన్లు.ఇన్ని రోజులు ఇళ్లలోనే అనుకున్నా.

ఇప్పుడు మందు షాపుల్లోనూ మీరు సెటిల్​ అయ్యారా ఎలుక మామయ్యా అంటూ కూడా కామెంట్లు వస్తున్నాయి.కానీ ఇలా ఎలుకలు మందు తాగడం ఎప్పుడూ చూడలేదని ఎక్సైజ్​ అధికారులు చెబుతున్నారు.

ఏది ఏమైనా ఎలుకలు వైన్​ తాగి పార్టీ చేసుకున్న విషయం ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube