తనను పెంచుకునే అవ్వకు జ్వరం వచ్చిందని 'కొండముచ్చు' ఏం చేసిందో తెలుసా!

ప్రస్తుత సమాజంలో మనుషుల్లో మానవత్వం నశించి పోతుంది.పక్కన వాళ్ళు ఎన్ని కష్టాల్లో ఉన్న కూడా వాళ్ళను పట్టించు కోవడం ఎప్పుడో మానేశారు.

ఇప్పటి రోజుల్లో కన్న పిల్లలే తల్లి దండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చుతున్నారు.వారిని కానీ పెంచి పెద్ద వారిని చేసి ప్రయోజకులను చేతిలో తల్లిదండ్రుల పైనే ప్రేమ చూపించడం లేదు.

కానీ జంతువులూ అలా కాదు.వాటిని ప్రేమగా దగ్గరకు తీసుకుంటే చివరి వరకు తోడుగా ఉంటాయి.

ఆ విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువైంది.ఎప్పుడు విశ్వాసం అంటే కుక్కలతోనే ఎక్కువుగా పోలుస్తారు.

Advertisement

కానీ ఇతర జంతువులూ కూడా అలా విశ్వాసంగా ఉండగలవని తమను ప్రేమగా దగ్గరకు తీసుకున్న వ్యక్తులను ఎప్పటికి మరిచి పోలేవని నిరూపిస్తున్నాయి.తాజాగా కొండముచ్చు చేసిన పనికి అంత ఫిదా అవుతున్నారు.

తనను ప్రేమగా దగ్గరకు తీసుకున్న వారిపై చూపించే విశ్వాసంకు నెటిజెన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది.తనను ప్రేమగా దగ్గరకు తీసుకున్న ముసలవ్వ పై కొండముచ్చు తన విశ్వాసాన్ని చాటుకుంది.రోజు కడుపు నిండా అన్నం పెట్టే అవ్వ కు జ్వరం వచ్చిందని ఆ కొండముచ్చు తల్లడిల్లింది.

ఆమె కొద్దీ సేపు కనిపించక పోయేసరికి ఆమె కోసం చూస్తూ ఉంది.ఆమె జ్వరంతో వచ్చి మంచం మీద పడుకోగానే ఆమె దగ్గరకు వెళ్ళింది.ఆ ముసలవ్వను దగ్గరకు తీసుకుని ప్రేమగా హత్తుకుంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

అవ్వ కూడా కొండముచ్చు ప్రేమను చూసి దాని వీపు నిమురుతూ తన ఆనందాన్ని వ్యక్తపరిచింది.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది.

Advertisement

ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇంకా తెలియరాలేదు.అయితే ఆ కొండముచ్చు ప్రేమ మాత్రం నెటిజెన్స్ ను బాగా ఆకట్టుకుంది.

అందుకే నెత్తిన వైరల్ అయ్యింది.మీరు కూడా ఆ వీడియోను ఒక్కసారి చూసేయండి.

https://youtu.be/f61BU-PybNo

తాజా వార్తలు