రష్మిక మందన్నా కుర్ర కారు గుండెల్లో ప్రస్తుతం ఈ హీరోయిన్ కి సూపర్ క్రేజ్ ఉంది.ఆమె పేరు చెప్తే యువత సైతం పిచ్చెక్కిపోతున్నారు.
రష్మికకు తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా ఉన్నప్పటికీ ప్రస్తుతం తెలుగులో ఏ సినిమాల్లోనూ కనిపించడం లేదు పుష్ప సినిమా హిట్ అవడమే ఎందుకు కారణం.పుష్ప హిందీ వర్షన్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో రష్మిక బాలీవుడ్ లో బాగా పేరు సంపాదించుకుందనే చెప్పాలి.
ముఖ్యంగా పుష్ప సినిమాలో రష్మిక మందన క్యారెక్టర్ చాలా హైలైట్ అయింది దీంతో రష్మికకి హిందీలో వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి.ఇప్పటికే అమితాబచ్చన్ తో ఒక సినిమాని ఒప్పుకున్న రష్మిక మిస్టర్ మజ్ను అనే మరో సినిమా కి కూడా సంతకం చేసిన విషయం మనందరికీ తెలిసిందే.
ఈ రెండు సినిమాలే కాకుండా ఇప్పుడు మరొక సినిమాని కూడా రష్మిక ఓకే చేసిందట.ఇలా రష్మిక బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అవ్వడానికి ముఖ్య కారణం ఎవరు అంటే కచ్చితంగా చెప్పాల్సింది విజయ్ దేవరకొండ పేరే.
ఎందుకు అంటే రష్మిక వెనకాల ఉన్నది విజయ్ దేవరకొండ మాత్రమే.వాస్తవానికి తెలుగులో రష్మిక బిజీ అవ్వడానికి కూడా విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా నే కారణం.

ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లోనూ నటించారు అంతేకాదు వారిద్దరూ మంచి స్నేహితులు అనే విషయం మనకు అందరికీ తెలిసిందే.ఎక్కడ చూసినా వీరిద్దరు చెట్టాపట్టాలేసుకొని కనిపిస్తూ ఉంటారు.ఇక ఈ స్నేహం కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం అవ్వలేదు.బాలీవుడ్ లో కూడా అది సినిమా అవకాశాలు ఇవ్వడానికి ఊతమిస్తుండడం కోసమెరుపు.ఎందుకంటే విజయ్ దేవరకొండ కి కరణ్ జోహార్ తో మంచి సాన్నిహిత్యం ఉంది.అందుకే కరణ్ జోహార్ కి రష్మికను పరిచయం చేశాడట విజయ్, దాంతో ఆమెను బాలీవుడ్ లో బిజీ చేసే పని కూడా కరణ్ జోహార్ చేతిలోనే పెట్టేసాడట.

అలా వరుస అవకాశాలు అందుకుంటూ రష్మిక ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోతుంది.బాలీవుడ్లో ప్రస్తుతం వికీ డోనర్, బాలా లాంటి యూత్ ఫుల్ సినిమాల్లో నటించిన ఆయుష్మాన్ ఖురానా తో మరో సినిమా చేయడానికి రష్మిక ఓకే చేసినట్టుగా తెలుస్తుంది.యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఆయుష్మాన్ తో సినిమా చేయడం అంటే నిజంగా రష్మిక నక్కతోక తొక్కినట్టే అని భావిస్తున్నారు.మొత్తానికి ఇలా బాలీవుడ్ లో పాగా వేసేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది రష్మిక.