బుల్లితెర యాంకర్ రష్మీ పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో వేర్వేరు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.కొంతమంది రష్మీకి పెళ్లైందని చెబితే మరి కొందరు రష్మీ మొదటి భర్తతో విడాకులు తీసుకొని మళ్లీ పెళ్లి చేసుకున్నారని చెబుతున్నారు.
కొందరు మాత్రం రష్మీకి ఇంకా పెళ్లి కాలేదని రాబోయే రోజుల్లో రష్మీ, సుధీర్ పెళ్లి చేసుకునే ఛాన్స్ అయితే ఉందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు.
అయితే తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజైంది.
ఈ నెల 27వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుండగా ఈ ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.రాజశేఖర్ ఈ ఎపిసోడ్ కు స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.
ప్రోమోలో చివర్లో రష్మీ పెళ్లికూతురు గెటప్ లో కనిపించారు.పెళ్లికూతురు గెటప్ లో రష్మీ గౌతమ్ చాలా అందంగా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అయితే పెళ్లి కొడుకు ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు.
రష్మీ పక్కన ఉన్నది సుధీర్ అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ షో చూస్తే మాత్రమే ఈ షోలో ఉన్నది ఎవరనే ప్రశ్నకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఈ ప్రోమోకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.
రష్మీ పక్కన ఉన్నది ఎవరో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.రష్మీ పెళ్లికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
రష్మీ పెళ్లికి సంబంధించి అనేక విషయాలలో ప్రేక్షకులకు క్లారిటీ రావాల్సి ఉంది.రష్మీ స్పందించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.
రష్మీ ఒక్కో షోకు భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.రష్మీ ఈటీవీ షోలతో పాటు స్టార్ మా ఛానల్ లో షోలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
రష్మీ కెరీర్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.