Rana, Sai Pallavi, Venu Udugula, Sudhakar Cherukuri’s Virata Parvam Theatrical Release Preponed To June 17th

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిప‌ల్లవి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రం ‘విరాట‌ప‌ర్వం‘.డి.సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.

 Rana, Sai Pallavi, Venu Udugula, Sudhakar Cherukuri’s Virata Parvam Theatrical-TeluguStop.com

వి.సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 1న విడుదల కానుందని చిత్ర యూనిట్ ఇదివరకు ప్రకటించింది.ఐతే ఇప్పుడా విడుదల తేది మరింత ముందుకు వచ్చింది.విరాట పర్వం జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది.1990లలో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొంది తెరకెక్కించిన ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రావన్న పాత్రను పోషించారు. సాయి పల్లవి, వెన్నెల పాత్రలో కనిపించనుంది.

యుద్ధం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథగా విరాట పర్వం ఉండబోతుంది.

ఈ చిత్రానికి డానీ సాంచెజ్ లోపెజ్‌, దివాకర్ మ‌ణి సినిమాటోగ్రఫీ అందించగా, సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నారు.ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్ చంద్ర, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వరీ రావ్‌, సాయిచంద్‌ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

తారాగ‌ణం:

రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్లవి, ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్ చంద్ర, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వరీ రావ్‌, సాయిచంద్‌, బెన‌ర్జీ, నాగినీడు, రాహుల్ రామ‌కృష్ణ, దేవీప్రసాద్‌, ఆనంద్ ర‌వి, ఆనంద్ చ‌క్రపాణి తదితరులు

సాంకేతిక విభాగం:

ర‌చ‌న‌-ద‌ర్శక‌త్వం: వేణు ఊడుగుల‌, నిర్మాత‌: సుధాక‌ర్ చెరుకూరి, బ్యాన‌ర్స్‌: సురేష్ ప్రొడ‌క్షన్స్‌, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, స‌మ‌ర్పణ‌: సురేష్ బాబు సినిమాటోగ్రఫీ: డానీ సాంచెజ్ లోపెజ్‌, దివాకర్ మ‌ణి ఎడిటింగ్‌: శ్రీ‌క‌ర్ ప్రసాద్‌ ప్రొడ‌క్షన్ డిజైన్‌: శ్రీ‌నాగేంద్ర మ్యూజిక్‌: సురేష్ బొబ్బిలి స్టంట్స్‌: స్టీఫెన్ రిచ‌ర్డ్‌, పీట‌ర్ హెయిన్‌ కొరియోగ్రఫీ: రాజు సుంద‌రం పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్‌కుమార్ చాగంటి ప‌బ్లిసిటీ డిజైన్‌: ధ‌ని ఏలే

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube