అమెరికా కాకుండా ఇతర దేశాల్లో జక్కన్న మూవీ పరిస్థితి ఏంటీ?

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్‌ సినిమా అమెరికా లో భారీ ఎత్తున రిలీజ్కు సిద్ధమైంది.ఈ సినిమా పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షో లు పడబోతున్నాయి.

 Ram Charan Ntr Movie Rrr Collections Going To Record Breaking Ram Charan, Ntr ,-TeluguStop.com

అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఏకంగా రెండు మిలియన్ల డాలర్లు వసూలు చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.సినిమా విడుదలకు మరో వారం రోజులు గడువు ఉన్న కారణంగా ఈ మొత్తం మరింతగా పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు.

అమెరికాలో ఈ సినిమా ఏకంగా పది మిలియన్ల వస్తువులను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ అక్కడి ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఒక్క అమెరికాలోనే పది మిలియన్ల డాలర్లు వసూలు చేస్తే ఇతర ప్రంపచ దేశాల్లో ఎంత వసూళ్లు సాధ్యం అవుతుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

అక్కడ ఎంత వసూళ్లు సాధిస్తుంది అనేది ప్రతి ఒక్కరు ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ సమయంలో ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం ప్రకారం ఆస్ట్రేలియా మరియు ఇతర ప్రపంచ దేశాల్లో ఈ సినిమా ఖచ్చితంగా మంచి వసూళ్లను సొంతం చేసుకుంటుంది.

కానీ అమెరికా స్థాయిలో మాత్రం చేసుకునే అవకాశం లేదని అంటున్నారు.అమెరికాలో పది మిలియన్ల డాలర్లు వసూలు చేయడం తో ఈ సినిమా ప్రపంచ దేశాల్లో మరో 10 మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

Telugu Ajay Devgan, Alia Bhatt, Rajamouli, Ram Charan-Movie

అంటే భారతదేశంలో కాకుండా అమెరికా మరియు ఇతర ఓవర్సీస్ ఏరియాలో ఈ సినిమా 20 మిలియన్ల డాలర్లను వసూలు చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.ఇది చిన్న మొత్తం ఏమి కాదు.ఇంత భారీ మొత్తంలో వసూలు చేయాలంటే ఏ బాలీవుడ్ సినిమాకు కూడా సాధ్యం కాదు.అది కేవలం టాలీవుడ్ జక్కన్న రాజమౌళి మాత్రమే సాధ్యమవుతుంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేళ ఈ సినిమా 20 మిలియన్ల డాలర్లను వసూలు చేస్తే కచ్చితంగా సెన్షేషన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.జక్కన్న గతంలో బాహుబలితో ఇలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

కనుక మళ్లీ ఆయన సెన్షేషన్‌ క్రియేట్ చేస్తాడు అనడంలో సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube