సమాజంలో కొన్ని వీడియోలు చూస్తుంటే మనుసు తరుక్కుపోయింది.సమాజంలో ఇప్పుడు ఎలాంటి ఘటన జరిగినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొన్ని మనుసును కదిలించేలా.కొన్ని కన్నీళ్లు తెప్పించేలా ఉంటాయి.
మరికొన్ని హస్యంగా ఉంటాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వీపరితంగా వైరల్ అయింది.
దాని కథ ఎంటో ఇప్పుడు చూద్దాం.
ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ప్రాంతాల్లో ఓ ఎలుక రోడ్డు దాటడానికి ప్రయత్నించింది.
అప్పుడు కారు వేగంగా వస్తోంది.ఇక ఎలుక కారు కింద పడిపోతుంది అనుకొనే లోపల కాకి అపద్బాంధవుడిలా వచ్చి ఎలుకను కాపాడింది.
కాకి ఎంతో తెలివిగా ఎలుక తోక పట్టుకొని వెనక్కి లాగింది.దీంతో ఎలుక చావు నుంచి బయటపడింది.
ఇప్పుడు ఈ వీడియో టిట్టర్, ఫేస్ బుక్, సామాజిక మధ్యమాల్లో తెగ వైరల్ అయింది.కాకి చూపించిన మానవత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఏదిఏమైనా ఒక ప్రాణిని మరో ప్రాణి రక్షించడం చాలా గొప్పగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.ఏకంగా ఈ వీడియోను ఒక ఐఎఎస్ అధికారి తన సెల్ ఫోన్లో బంధించి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడం విశేషం.
దానికి ఏకంగా ఆయన ఒక క్యాప్షన్ కూడా పెట్టారు.

’తప్పుదారిలో వెళ్లకుండా ఎవరు అడ్డుకుంటారో వారే నిజమైన స్నేహితులంటూ‘ అందులో రాశాడు.ఒక స్నేహితుడు తప్పుడు మార్గంలో నడుస్తున్నట్లు అయితే అతనని తప్పు మార్గంలోకి వెళ్లకుండా ఆపడానికి కచ్చితంగా ఒక స్నేహితుడు ఉండాలన్నదే దాని ఆర్థం.ఈ 12 సెకన్ల వీడియోకు కొన్ని వేల మందికి పైగా వీక్షించగా.
కొన్ని వందలాది మంది షేర్లు చేయడం గమనార్హం.ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాల టైటిల్స్ ఇస్తూ అభినందనలు తెలుపుతున్నారు.
ఎలుక, కాకి నిజమైన ఫ్రెండ్స్ గా మిగిలిపోయారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.







