చెన్నై ను చిత్తుగా ఓడించిన రాజస్థాన్.. లీగ్ పట్టికలో అగ్రస్థానంలో..!

ఈ ఐపీఎల్ ఆరంభంలో కాస్త తడబడి, ఆ తరువాత హ్యాట్రిక్ విజయాలతో జోరు కొనసాగిస్తూ అగ్రస్థానంలో ఉన్న చెన్నై జట్టును రాజస్థాన్ జట్టు చిత్తు చేసి అగ్రస్థానానికి చేరింది.తాజాగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో 32 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయాన్ని సాధించింది.ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ అర్థ సెంచరీ( Yashasvi Jaiswal ) తో చెలరేగి రాజస్థాన్ జట్టు విజయంలో కీలక భాగస్వామి అయ్యాడు.43 బంతులలో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్స్ లతో చెలరేగి 77 పరుగులు చేశాడు.

 Rajasthan Royals Beat Chennai Super Kings Ipl 2023, , Rajasthan Royals , Shi-TeluguStop.com

ఇతనితో పాటు ధృవ్ జురెల్ ( Dhruv Jurel )15 బంతులలో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 34 పరుగులు చేశాడు.రాజస్థాన్ జట్టు 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసి చెన్నై జట్టు ముందు భారీ టార్గెట్ ఉంచింది.

తర్వాత లక్ష్య చేదనకు చెన్నై జట్టులో రుతురాజ్ గైక్వాడ్ 29 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ తో చెలరేగి 47 పరుగులు చేసి శుభారాంబాన్ని అందించాడు.శివం దూబే ( Shivam Dube )కూడా 33 బంతులలో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 52 పరుగులు చేశాడు.ఇంకా కొంతసేపు వీరిద్దరూ క్రీజు లో నిలబడి ఉంటే చెన్నై గెలిచే అవకాశం ఉండేది.

వీరిద్దరూ అవుట్ కావడంతో అనుకున్న రీతిలో పరుగులు రాక చివరికి చెన్నై ఓటమిపాలైంది.మ్యాచ్ చివరలో వచ్చిన రవీంద్ర జడేజా 15 బంతుల్లో 23 పరుగులు, మెయిన్ అలీ 12 బంతులలో 23 పరుగులు చేసిన ఫలితం లేకుండా పోయింది.20 ఓవర్లలో 170 పరుగులు చేసి 32 పరుగుల తేడాతో చెన్నై ఓడి, లీగ్ పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి పడిపోయింది.రాజస్థాన్ బౌలర్లైన అడం జంపా 3 వికెట్లు( Adam Zampa ), రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీసి చెన్నై జట్టు బ్యాటర్లను కట్టడి చేయడంతో రాజస్థాన్ జట్టు ఘన విజయం సాధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube