ఆ హీరోయిన్ తో ప్రభాస్ లవ్ ట్రాక్.. డార్లింగ్ ఫ్యాన్స్ ను అలరిస్తుందా?

బాహుబలి సిరీస్ గురించి తెలియని ఇండియన్ ప్రేక్షకులు లేరు.మరి ఈ సిరీస్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) .

 Prabhas Romantic Mode In Maruthi Movie , Malavika Mohanan, Prabhas, Maruthi, Pra-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత ఈయన లైనప్ భారీగా పెరిగింది.కానీ వరుస ప్లాప్స్ వస్తున్నాయి.

అయినా కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా ఫుల్ బిజీగా ఉన్నాడు.వరుసగా పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషీ ఇస్తున్నాడు.

వరుస షూటింగులతో ఏ మాత్రం విశ్రాంతి లేకుండా గడుపుతున్న డార్లింగ్ నటిస్తున్న సినిమాల్లో మారుతి సినిమా కూడా ఉంది.ఇది ఈయన మిగతా ప్రోజెక్టుల కంటే కాస్త తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

ఈ సినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ లేకుండా కేవలం రిలీజ్ తర్వాత ప్రాఫిట్స్ లో వాటా మాత్రమే తీసుకో బోతున్నాడు.ప్రభాస్ మారుతి ( Maruthi ) దర్శకత్వంలో హారర్ కామెడీ చేయబోతున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటి వరకు అయితే ఈ సినిమా గురించి ఎలాంటి అనౌన్స్ మెంట్ కూడా రాలేదు కానీ ఈ సినిమా షూట్ మాత్రం పూర్తి అవుతుంది అని తెలుస్తుంది.ఇప్పటికే 30 శాతానికి పైగానే పూర్తి అయినట్టు టాక్.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ వైరల్ అయ్యింది.రాజా డీలక్స్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ ( Malavika Mohanan ) మెయిన్ హీరోయిన్ గా కనిపిస్తుంది.

మరి వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ బాగుంటుందట .ఇక ఈ సినిమాలో వీరిద్దరి రొమాంటిక్ లవ్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని.ఈ ట్రాక్ నడిపిస్తూనే కావాల్సినంత కామెడీ కూడా పండించేలా మారుతి ప్లాన్ చేసాడట.మొత్తానికి మారుతి ప్రభాస్ తో ఎలా ప్లాన్ చేస్తున్నాడో అని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాను 100 కోట్ల లోపులోనే పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube