అక్కినేని నాగేశ్వర్‌రావు కుటంబం నుంచి వచ్చిన నటవారసుడు నాగార్జున.తండ్రి ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చినా.తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.1986లో సినిమా ఇండస్ట్రీలోకి అడుపెట్టిన నాగార్జున.ఇప్పటి వరకు 80 సినిమాలకు పైగా నటించారు.అన్ని రకాల సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించాడు.అయితే నాగార్జున ముందుకు వచ్చిన కొన్ని సినిమాలను ఆయన ఆయా కారణాలతో వదులుకున్నాడు.వాటిలో కొన్ని హిట్స్ కాగా.
మరికొన్ని ఫ్లాప్స్‌గా మిగిలాయి.నాగార్జున్ వదులుకున్న టాప్ 5 సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
మౌనరాగం:
నాగార్జున వదులుకున్న హిట్ సినిమాల్లో ఇది ఒకటి.మణిరత్నం డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది.ముందుగా నాగార్జుననే హీరోగా అనుకున్నాడు.కానీ ఆయన నో చెప్పడంతో.ఆ అవకాశం మోహన్‌బాబుకు వచ్చింది.
ఈ సినిమా డైలాగ్ కింగ్ కెరీర్‌లో మంచి మలుపు అయ్యింది.ఈ మూవీ తర్వాత మణిర్నతం నాగార్జునతో గీతాంజలి సినిమా చేశారు.
మెకానిక్ అల్లుడు:

బి గోపాల్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందిన చిత్రం మెకానిక్ అల్లుడు.ఈ సినిమా స్టోరీ మొదట నాగార్జునకు చెప్పాడు దర్శకుడు.కథ బాగున్నా.డేట్స్ కుదరలేదు.దీంతో నాగార్జున నో చెప్పాడు.ఈ సినిమాలో నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వర్‌రావు కూడా నటించాడు.
ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది.
కలిసుందాం రా:

వెంకటేష్ హీరోగా చేసిన ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.కనీవినీ ఎరుగని హిట్ తో వెంకేటష్ కెరీర్ మలుపు తిరిగింది.ఈ సినిమా స్టోరీని దర్శకుడు ఉదయ్ శంకర్ మొదట నాగార్జునకు వివరించాడు.
కానీ ఆయా కారణాలతో ఆయన నో చెప్పాడు.ఆ తర్వాత ఈ సినిమా వెంకటేష్ ముందుకు వెళ్లింది.
ఆహా:

జగపతి బాబు, ఆమని హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమా స్టోరీని తొలుత దర్శకుడు నాగార్జునకు చెప్పాడు.అయితే ఈ కథ తనకు సెట్ కాదని చెప్పి నాగార్జున రిజెక్ట్ చేశాడు.దీంతో జగపతిబాబు హీరోగా ఈ సినిమా తెరక్కెంది.నాగార్జున ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించినా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు:

వెంకటేష్, మహేష్‌బాబు జంటగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.ఈ సినిమా కథను డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తొలుత నాగార్జునకు వివరించాడు.అయితే మల్టీసారర్ మూవీ కావడంతో ఆయన ఒప్పుకోలేదట.
ఆ తర్వాత వెంకీ, మహేష్ హీరోలుగా సినిమా రెడీ అయ్యింది.
ఇవే కాకుండా పలు రజినీకాంత్ హీరో గా నటించిన దళపతి సినిమాను మరియు నన్ను రుద్రన్ అనే ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమాలను సైతం నాగార్జున వదిలేసాడు
.