అమెజాన్ అకాడమీ జేఈఈ ఫ్రీ కోచింగ్..!

జేఈఈ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అమెజాన్ అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది.అమెజాన్ ఇండియా అమెజాన్ అకాడమీ పేరుతో ఒక ఎడ్ టెక్ ఫ్లాట్ ఫాం ఏర్పాటు చేసింది.

 Amazon Academy Offering Free Coaching For Jee Preparing Students ,amazon Academy-TeluguStop.com

జనవరి నుండి ఇది అందుబాటులోకి వచ్చింది.ఈ ఫ్లాట్ ఫాం ద్వారా ఐఐటీ జేఈఈ విద్యార్ధులకు ఫ్రీ కోచింగ్ ఇస్తుంది.

నిపుణులైన జేఈఈ టీచర్స్ తో లైవ్ సెషన్స్ ని కూడా అందుబాటులో ఉంచుతుంది.ఈ ఫ్రీ కోచింగ్ వివారల కోసం https://academy.amazon.in వెబ్ సైట్ లో ఎన్ రోల్ చేసుకోవాల్సి ఉంటుంది.

గూగుల్ ప్లే స్టోర్ లో అమెజాన్ అకాడమీ యాప్ డౌన్ లోడ్ చేసుకుని కూడా ఎన్ రోల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.అయితే ముందు ఈ కోచింగ్ ను ఫ్రీగానే అందించనున్నట్టు అమెజాన్ అకాడమీ చెబుతుంది.స్టూడెంట్స్ తమ ఇంటి వద్దే ఇంటర్నెట్ కనెక్ష, స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్ టాప్ ల ద్వారా ఈ కోచింగ్ తీసుకునే అవకాశం ఉంది.

జేఈఈ పరీక్షలకు సిద్ధం అవుతున్న వారికి అమెజాన్ అకడమీ ఇచ్చే ఈ కోచింగ్ చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు.అయితే కేవలం కోచింగ్ మాత్రమే కాదు మాక్ టెస్టులను ఇక్కడ పెడతారని తెలుస్తుంది.

అంతేకాదు తన డౌట్స్ ను అనుభవమైన టీచర్స్ ను అడిగి తెలుసుకోవచ్చని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube