హోలీ పర్వదినాన్ని( Holi Festival ) భారతీయులు ఘనంగా జరుపుకున్నారు.చిన్నా పెద్దా తేడా లేకుండా ఆనందాల కేళిలో ప్రజలు మునిగిపోయారు.
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోనూ హోలీ వేడుకలు జరిగాయి.భారతీయులు స్ధిరపడిన ప్రాంతాల్లో ఈ పర్వదినం ఘనంగా జరిగింది.
ఈ క్రమంలో బీహార్ జార్ఖండ్ అసోసియేషన్ (బీజేఏఐ ఐర్లాండ్)( BJAI Ireland ) ప్రజలు .ఐర్లాండ్‌లని నాస్, కో కిల్డేర్‌లో సోమవారం హోలీని జరుపుకున్నారు.దీనికి ముందు రోజు (మార్చి 24)న భోగి మంటలు, హోలికా దహన్ కార్యక్రమాలు నిర్వహించారు.
కాగా.అమెరికాలోని ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ (ఏఎస్‌యూ)లోని( Arizona State University ) ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐఎస్ఏ) సోమవారం ఘనంగా హోలీని నిర్వహించింది.వివిధ సాంస్కృతిక నేపథ్యాలకు చెందిన దాదాపు 2000 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారని ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు.
టెంపే ఎస్‌డీఎఫ్‌సీకి ఉత్తరాన వున్న గడ్డి మైదానంలో వేడుకలు నిర్వహించారు.భారత్‌లో హోలీ వేడుకలు( Holi Celebrations ) వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తాయని గ్లోబల్ మేనేజ్‌మెంట్ చదువుతున్న గ్రాడ్యుయేట్ విద్యార్ధి అవిరల్ జైన్ అన్నారు.
భారతదేశంలో మనం జరుపుకునే అతిపెద్ద పండుగ హోలీ అని ఆయన తెలిపాడు.హోలీ ఏఎస్‌యూలో సాంస్కృతికి మార్పిడిని సూచిస్తుందని .తాను స్నేహితులతో ఆడటం లేదని, అపరిచితులతో ఆడుతున్నానని దీని వల్ల బంధాలను అభివృద్ధి చేసుకోవచ్చునని జైన్ పేర్కొన్నాడు.
ఏఎస్‌యూలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్ధుల్లో 6400 మంది భారత్ నుంచి వచ్చినట్లు వర్సిటీ అధికారులు ధృవీకరించారు.ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్( Indian Students Association ) సభ్యుడు , మాలిక్యులర్ బయోసైన్స్ , బయో టెక్నాలజీ చదువుతున్న అరిన్ షా మాట్లాడుతూ.భారతీయ విద్యార్ధుల జనాభా ఎక్కువగా వున్నందునే ఐఎస్ఏలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.
ఇకపోతే.దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీలు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ పండుగ అందరి జీవితాల్లో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని తీసుకురావాలని .ఆప్యాయత, సామరస్యం అనే రంగులతో ఈ పండుగను జరుపుకోవాలని ఇద్దరు నేతలు పిలుపునిచ్చారు.