తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ లు అద్భుతంగా ఉన్నాయని గనులు,భూగర్భవనరులు, పంచాయతీ రాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి కడియం పల్ల వెంకన్న నర్సరీ ని సందర్శించారు.
నర్సరీ యాజమాన్యం పల్ల సత్యనారాయణ మూర్తి,గణపతి,వెంకటేష్ లు మంత్రి కి పూల మొక్కలతో ఘన స్వాగతం పలికారు.
నర్సరీ మొక్కల ఉత్పత్తులను పరిశీలించిన ఆయన నర్సరీ రైతుల కృషిని ప్రశంసించారు.
అంగవైకల్యాన్ని జయించి పల్ల వెంకన్న నర్సరీ రంగంలో సాధించిన ప్రగతిని కొనియాడారు.దేశ పర్యావరణ పరిరక్షణకు నర్సరీ మొక్కల ఉత్పత్తి చాలా అవసరమని తెలిపారు.
ఆయన వెంట రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్, రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ తదితరులు ఉన్నారు.బైట్;మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
.