సౌత్ ఇండియా లో కలలో కూడా ఊహించని ఒక అద్భుతమైన కాంబినేషన్ మిస్ రీసెంట్ గానే మిస్ అయ్యింది.సౌత్ లో అభిమానులు దైవం తో సమానంగా కొలిచే రేంజ్ ని సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు కమల్ హాసన్ కాంబినేషన్ లో ఒక సినిమా మిస్ అయ్యిందట.
ఆ సినిమా మరేదో కాదు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘బ్రో ది అవతార్’.ఈ సినిమా తమిళం లో మంచి ప్రేక్షాధారణ పొందిన ‘వినోదయ్యా చిత్తం‘ అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా నేరుగా థియేటర్స్ లో కాకుండా ఓటీటీ లోనే విడుదల అయ్యింది.కేవలం గంట 27 నిమిషాల నిడివి మాత్రమే ఈ సినిమాకి ఉంటుంది.
అయితే ఈ ప్రాజెక్ట్ ని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )తో భారీ గా తీద్దాం అని అనుకున్నాడట డైరెక్టర్ సముద్ర ఖని.

ఇదే విషయాన్నీ డైరెక్టర్ త్రివిక్రమ్( Trivikram ) కి చెప్పగా ఆయనకీ ఎంతో నచ్చి, కేవలం ‘వినోదయ్యా చిత్తం’ స్టోరీ లైన్ ని తీసుకొని ఒక మల్టిస్టార్రర్ చిత్రం గా భారీ కాన్వాస్ తో తెరకెక్కించే విధంగా స్టోరీ , స్క్రీన్ ప్లే అందించాడట.దేవుడి పాత్రకి పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయిపోయాడు,మరి సామాన్య వ్యక్తి పాత్ర కోసం పలువురి సూపర్ స్టార్స్ ని అనుకున్నారట.అందులో ముందు వరుసలో ఉన్న సూపర్ స్టార్ కమల్ హాసన్.
ఆయన్ని సముద్ర ఖని( Samuthirakani ) స్వయంగా కలిసి, స్టోరీ వినిపించి చేయాల్సిందిగా కోరాడట.ఆయనకీ చెయ్యాలని ఆసక్తి ఉన్నపటికీ డేట్స్ సమస్య తలెత్తడం తో కాల్ షీట్స్ ఇవ్వలేకపోయాడు.
ఇక ఆ తర్వాత ఆ పాత్ర కోసం మోహన్ లాల్ ని సంప్రదించారట, కానీ ఆయన డేట్స్ కూడా అందుబాటులో లేదు.త్రివిక్రమ్ ఈ సబ్జెక్టు ని ఒక మిడిల్ ఏజ్ వ్యక్తి మరియు దేవుడికి మధ్య జరిగే కథ గా రాసుకున్నాడట.

కానీ ఎప్పుడైతే ఈ పాత్ర చెయ్యడానికి కమల్ హాసన్ మరియు మోహన్ లాల్ ఒప్పుకోలేదో , త్రివిక్రమ్ ఆ స్క్రిప్ట్ మొత్తాన్ని పక్కన పెట్టేసి, మళ్ళీ సరికొత్తగా రాసుకున్నాడట, అప్పుడు తెరమీదకి సాయి ధరమ్ తేజ్ వచ్చాడు.అలా ఈ సినిమాని పూర్తి చేసారు, వచ్చే నెల 28 వ తారీఖున విడుదల అవ్వబోతుంది ఈ చిత్రం.ఈ సినిమాలో పాటలు ఉంటాయట , ఫైట్స్ ఉంటాయట.ఒక రెగ్యులర్ పవన్ కళ్యాణ్ సినిమా నుండి ఫ్యాన్స్ ఏవైతే కోరుకుంటారో, అవన్నీ ఈ చిత్రం లో ఈ చిత్రం లో ఉంటాయట.
రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ మరియు ఊర్వశి రౌతుల కాంబినేషన్ లో ఒక పార్టీ సాంగ్ ని చిత్రీకరించారు.సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని, వింటేజ్ పవన్ కళ్యాణ్ కామెడి మరియు స్టైల్ ని ఈ చిత్రం లో ఫ్యాన్స్ మరోసారి చూడబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వార్త.
ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే వచ్చే నెల 28 వరకు ఆగాల్సిందే.