మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి( Patnam Mahender Reddy ) ఇవాళ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.ఈ మేరకు కుటుంబంతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు.
ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ను కలవనున్నారు.వారి సమక్షంలోనే పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.ఈ క్రమంలో మహేందర్ రెడ్డి దంపతులకు ఖర్గే ( Mallikarjun Kharge )కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.అయితే ఇప్పటికే పట్నం మహేందర్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )ని కలిసిన సంగతి తెలిసిందే.