ఏడాది వయసున్న భారతీయ బాలుడు మిలయనీర్ అయ్యాడు.ఏంటీ నమ్మశక్యంగా లేదా.
కానీ ఇది నిజం.మంగళవారం తీసిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలినీయం మిలియనీర్ బంపర్‌డ్రాలో ఏడాది బాలుడు మొహమ్మద్ సలాకు లాటరీలో 1 మిలియన్ ప్రైజ్ మనీ కొట్టేశాడు.
అబుదాబిలో నివసిస్తున్న 31 ఏళ్ల రమీస్ రెహ్మాన్ ఆరేళ్లుగా లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నాడు.రమీస్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ ప్రమోషన్‌లలో ఏడాది నుంచి పాల్గొంటున్నాడు.ఈ క్రమంలో తన కొడుకు పేరుతో సిరీస్ 323లో 1319 నెంబర్ గల టికెట్‌ను కొనుగోలు చేయగా.దానికి బంపర్ డ్రా తగిలింది.
దీనిపై మొహమ్మద్ సలా తండ్రి రమీస్ రెహ్మాన్ స్పందిస్తూ.లాటరీ తగిలిన వెంటనే పట్టరాని సంతోషం కలిగింది.
దీంతో తన కొడుకు భవిష్యత్తు ఇప్పుడు భద్రంగా ఉంటుందని.దుబాయ్ డ్యూటీ ఫ్రీకి కృతజ్ఞతలు తెలిపాడు.
రమీస్ స్వస్థలం భారత్‌లోని కేరళ.
మొహమ్మద్ సలాతో పాటు మిలీనియం మిలియనీర్ డ్రాలో గెలుపొందిన మరో ముగ్గురు విజేతల పేర్లను కూడా నిర్వాహకులు ప్రకటించారు.
దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న 33 ఏళ్ల ఇరాన్ జాతీయుడు షాఘాయెగ్ అటార్జాదేహ్ (సిరీస్ 1745, టికెట్ నెంబర్ 0773)కు మెర్సిడెస్ బెంజ్ ఎస్ 560 (మాగ్నెటైట్ బ్లాక్ మెటాలిక్) కారు దక్కింది.అలాగే ఫిలిప్పిన్స్ జాతీయురాలు గ్లోరియా మాలాకాస్ట్ ( సీరిస్ 397, టికెట్ నెంబర్ 0253) మోటో గుజ్జీ ఆడేస్ మోటార్ బైక్ తగిలింది.
ఇక మరో విజేత రియాద్‌లో పనిచేస్తున్న కెనడా పౌరుడు తిమోతి రెడుచా ( సిరీస్ 398, టికెట్ నెంబర్ 0786)కు మోటో గుజ్జీ వి ఎస్ టీటీ మోటార్ బైక్ లభించింది.