త్రిఫల చూర్ణంతో అంతులేని ఆరోగ్య లాభాలు.. ఇంతకీ ఏ సమస్యకు ఎలా వాడాలంటే?

త్రిఫల చూర్ణం( Triphala Churna ). ఈ పేరు వినే ఉంటారు.

 Amazing Health Benefits Of Triphala Churna!, Triphala Churna, Triphala Churna Be-TeluguStop.com

ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ.ఈ మూడిటిని త్రిఫలాలు అంటారు.

వీటితో తయారు చేసే పొడినే త్రిఫల చూర్ణం.ఆయుర్వేద వైద్యంలో వివిధ రోగాలకు నివారణకు త్రిఫల చూర్ణాన్ని వాడతారు.

త్రిఫల చూర్ణం లో వివిధ పోషకాలతో పాటు అనేక ఔషధ గుణాలు నిండి ఉంటాయి.అందుకే ఈ చూర్ణంతో అంతులేని ఆరోగ్యం లాభాలు పొందుతారు.

ఇంతకీ ఈ త్రిఫల చూర్ణాన్ని ఏ సమస్యకు ఎలా వాడాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామంది మలబద్దకం సమస్య( Constipation )తో బాగా ఇబ్బంది ప‌డుతుంటారు.

ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మరిన్ని జబ్బులు తలెత్తుతాయి.ఈ నేపథ్యంలోనే మలబద్ధకం నుంచి బయటపడేందుకు మందులు వాడతారు.

కానీ అవసరం లేదు.రోజు నైట్ నిద్రించే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు టేబుల్ స్పూన్ త్రిఫల చూర్ణం కలిపి తాగితే మలబద్దకం దెబ్బకు పరారవుతుంది.

Telugu Tips, Latest, Triphala Churna, Triphalachurna-Telugu Health

నోటిపూత, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తస్రావం.వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి త్రిఫల చూర్ణం ఒక న్యాచురల్ మెడిసిన్ లా పనిచేస్తుంది.ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ లో హాఫ్ టేబుల్ స్పూన్ త్రిఫల చూర్ణం కలపాలి.ఈ వాటర్ ని నోట్లో పోసుకొని కనీసం ఐదు నిమిషాల పాటు బాగా పుక్కిలించి ఉమ్మేయాలి.

ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే ఆయా సమస్యలన్నీ దూరం అవుతాయి.

కంటి చూపు( Eye Sight ) తగ్గుతుందని బాధపడుతున్న వారు ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో పావు టేబుల్ స్పూన్ త్రిఫల చూర్ణం, వన్ టేబుల్ స్పూన్ తేనె, హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి కలిపి రోజుకు ఒకసారి సేవించాలి.

రోజు ఇలా చేస్తే కంటి చూపు అద్భుతంగా మెరుగుపడుతుంది.అదే సమయంలో ఇతర నేత్ర సంబంధిత సమస్యలు ఉన్న దూరం అవుతాయి.

Telugu Tips, Latest, Triphala Churna, Triphalachurna-Telugu Health

ఇక ఒక గ్లాసు చల్లని నీటిలో హాఫ్ టేబుల్ స్పూన్ త్రిఫల చూర్ణం కలిపి రోజుకు ఒకసారి తీసుకుంటే వెయిట్ లాస్( Weight Loss ) అవుతారు.రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.కాలేయ పనితీరు మెరుగు పడుతుంది.చాలామంది మహిళలు వైట్ డిశ్చార్జ్ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు.ఇలాంటి వారు వాటర్ లో త్రిఫల చూర్ణం వేసి మరిగించాలి.ఈ వాటర్ తో ఆ ప్రాంతాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఇలా రోజుకు ఒకసారి చేస్తే వైట్ డిశ్చార్జ్ సమస్యకు తగ్గుముఖం పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube