కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే.చైనాలో రోజురోజుకు కరోనా వైరస్ బారిన పడి మృతి చెందే వారి సంఖ్య పెరుగుతోంది.
కరోనా వైరస్ కు ఇదే సరైన మందు అంటూ వెబ్ మీడియాలో సోషల్ మీడియాలో చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి.ఒక బ్రిటన్ ఉపాధ్యాయుడు కరోనా వైరస్ కు ఇదే మందు అంటూ వైరల్ అవుతున్న వార్తలు అన్నీ అబద్ధమని తాను కనిపెట్టిందే కరోనా వైరస్ కు మందు అని చెబుతున్నాడు.
పూర్తి వివరాలలోకి వెళితే బ్రిటన్ కు చెందిన కానర్ రీడ్ చైనాలోని వుహాన్ లో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు.రెండు నెలల క్రితం ఇతనికి తీవ్రమైన జలుబుతో ఫ్లూ, న్యూమోనియా వచ్చింది.పరీక్షలు చేసిన వైద్యులు అతని శరీరంలో చిన్న క్రిమి ఉందని అందువలనే ఆరోగ్య సమస్యలు వచ్చాయని గుర్తించారు.14 రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు అతనికి సూచించారు.కానీ కానర్ రీడ్ మాత్రం వైద్యులు సూచించిన మందులు వద్దని సొంత వైద్యం వైపే మొగ్గు చూపాడు.
తాను ప్రతిరోజు తేనెను తీసుకొని ఒక గ్లాసు విస్కీలో కలుపుకొని తాగేవాడినని కొన్ని రోజులకు వ్యాధి లక్షణాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని కానర్ చెప్పాడు.
కరోనా వైరస్ లక్షణాలతో తాను కూడా బాధ పడ్డానని తనకు సోకింది కరోనా వైరస్ అయి ఉంటే మాత్రం విస్కీ, తేనె కలుపుకొని తాగితే మంచిదని కారన్ అన్నారు.కరోనా వైరస్ లక్షణాలు విస్కీ, తేనె కలుపుకొని తాగితే పూర్తిగా తగ్గిపోతాయని చెప్పారు.
ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడి 500మంది మృతి చెందగా 20,000కు పైగా కరోనా వైరస్ కేసులో నమోదు అయ్యాయి.